పేర్ని నాని పై కేసులో కీలక పరిణామం- హైకోర్టు నిర్ణయంతో..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడిన వారి పైన వరుస కేసులు.. అరెస్ట్ లు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. లిస్టులో ఇంకా పలువురు ముఖ్యులు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో బియ్యం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని పైన కేసు నమోదైంది. దీంతో, పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. ఇందులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రేషన్ బియ్యం మాయం కావటం పైన మాజీ మంత్రి పేర్ని నాని తో సహా ఆయన కుటుంబ సభ్యుల పైన పోలీసులు కేసు నమోదు చేసారు. పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం గోడౌన్ నుంచి తర లించారనే అభియోగాలు నమోదయ్యాయి. తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి మంత్రి నాదెం డ్ల మనోహర్ అసెంబ్లీలో సైతం కీలక అంశాలను వెల్లడించారు. ఇప్పటికే రూ 1.70 కోట్లు చెల్లిం చారు. మరో కోటి 67 లక్షలు చెల్లించాలని అధికారులు మళ్లీ నోటీసులు పంపించారు. కేసు విచార ణలో ఉందని చెప్పుకొచ్చారు. ఈ కేసులో పేర్ని నాని ఏ6గా ఉన్నారు. ఈ కేసులో ఏ1గా పేర్ని నాని భార్య పేర్ని జయసుధ, ఏ2గా మానస్ తేజ్, ఏ3గా కోటిరెడ్డి, ఏ4గా మంగారావు, ఏ5గా బాలాంజ నేయులు ఉన్నారు.

ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మచిలీపట్నం పీఎస్ లో పేర్ని జయసుధ విచారణకు హాజర య్యారు. ఆమెకు కోర్టు ఇప్పటికే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గత ప్రభుత్వ హాయంలో అక్రమాలు చేసిన వారిని వదిలేది లేదని ప్రభుత్వంలోని ముఖ్యులు పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలోనే పేర్ని నాని సైతం అరెస్ట్ అవుతారంటూ ప్రచారం సాగింది. కాగా.. తాను మచిలీపట్నం లోనే ఉన్నానని.. తన పైన ఎలాంటి చర్యలు అయినా తీసుకోవచ్చని పేర్ని నాని వ్యాఖ్యానించారు. తాజాగా హైకోర్టులో పేర్ని నాని దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటీషన్ పైన విచారణ జరిగింది. ఈ రోజు హైకోర్టు పేర్ని నానికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ నిర్ణయం వెలువరించింది. కోర్టు నిర్ణయం పేర్ని నానికి బిగ్ రిలీఫ్ గా మారనుంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications