దేవినేని ఉమకు భారీ ఊరట- అరెస్టు చేయొద్దన్న హైకోర్టు- విచారణకు ఓకే
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమకు హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనపై సీఐడీ దాఖలు చేసిన కేసులో అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే విచారణ మాత్రం చేసుకోవచ్చని తెలిపింది. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు సిద్ధమైన సీఐడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
ఓ ప్రెస్‌మీట్లో సీఎం జగన్ మాట్లాడిన వీడియోను మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రదర్శించారు. జగన్ వ్యాఖ్యల్ని జనంలోకి తీసుకెళ్లే ఉద్దేశంతో ఆయన విడుదల చేసిన వీడియోపై ప్రభుత్వం నుంచి ఫిర్యాదు అందుకున్న సీఐడీ కేసు నమోదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సీఎం జగన్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు మార్పింగ్ చేసిన వీడియో విడుదల చేశారంటూ దేవినేని ఉమపై సీఐడీ కేసు నమోదు చేసింది. అంతే కాదు 20 నిమిషాల్లో విజయవాడ నుంచి కర్నూలులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు కూడా ఇచ్చింది. అయితే ఆయన విచారణకు హాజరు కాలేదు.

సీఐడీ నోటీసుల మేరకు కర్నూల్లో విచారణకు దేవినేని ఉమ హాజరుకాకపోవడంతో ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఆయన్ను ప్రశ్నించేందుకు విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న ఆయన ఇంటికి కూడా వెళ్లారు. అయితే దేవినేని ఉమ అక్కడ కనిపించలేదు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. ఆ తర్వాత దేవినేని ఉమ తనపై సీఐడీ నమోదు చేసిన కేసు కొట్టేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.
దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇచ్చింది. అయితే విచారణకు సహకరించాలని సూచించింది. దీంతో ఈ నెల 29న మంగళగిరిలోని సీఐడీ కార్యాలయంలో ఆయన విచారణకు హాజరుకానున్నారు. విచారణలోపు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.
-
రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్, కీలక మార్పులు..!! -
ఎమ్మెల్యేలు కావాలనుకునే మహిళలు సిద్ధంగా ఉండండి -
వార్ ఎఫెక్ట్ :నిలిచిన సిలిండర్ల సరఫరా- బుకింగ్, వినియోగం పై తాజా ఆంక్షలు..!! -
విజయవాడలో పోలీసులపై గన్ తో కాల్పులు, వరంగల్ వ్యక్తి అరెస్ట్ -
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
అలిగిన `స్వీటీ`ని ఇంటికి భోజనానికి పిలిచిన విజయ్- రష్మిక -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..!












Click it and Unblock the Notifications