పవన్ కోసం హరిరామజోగయ్య మరో ఎత్తుగడ ? జనసేనకు కాపుసేన మద్దతు ! లెక్కలు మారతాయా ?
ఏపీ రాజకీయాల్లో కాపు నేతగా పేరొందిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పవన్ ను సీఎంగా చూసేందుకు తపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన మరో అస్త్రం సంధించారు.
ఏపీలో ప్రస్తుతం ఎన్నికల వాతావరణం నడుస్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో మరోసారి సామాజిక సమీకరణాలు తీవ్రంగా ప్రభావం చూపబోతున్నాయి. ఈ క్రమంలో రెడ్లు వర్సెస్ కమ్మలుగా సాగుతున్న పోరులో కాపుల మద్దతు ఎటు ఉండబోతోందన్నది చాలా కీలకం. ఇప్పటికే కాపుల హవా మొదలైంది. దాంతో పాటే కాపు సీఎం డిమాండ్ కూడా ఉధృతమవుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ రేసులో ముందున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆయన గురువు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కీలక ఎత్తులు వేస్తున్నారు.

ఏపీలో కాపు సమీకరణాలు
ఏపీలో దాదాపు 20 శాతానికి పైగా ఉన్నట్లు చెబుతున్న కాపులు ఎమ్మెల్యేలు, మంత్రులు, డిప్యూటీ సీఎం పదవుల వరకూ వెళ్లగలిగారు. అయితే సీఎం మాత్రం కాలేకపోయారు. దీంతో ఈసారి ఎలాగైనా కాపు సీఎం కోరిక నెరవేర్చుకోవాలని ఆ సామాజిక వర్గం గట్టి పట్టుదలగా ఉంది. అంతేకాదు ఈసారి తాము ఎవరికి మద్దతివ్వాలనే దానిపైనా చాలా స్పష్టతతో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో కాపు సమీకరణాలు ఎటువైపు మొగ్గుచూపుతాయో తెలియక ప్రధాన పార్టీలు తలపట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయా పార్టీల్లో ఉన్న నేతలకు సైతం చుక్కలు కనిపిస్తున్నాయి.

కాపు మంత్రులకు చుక్కలు
కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కళ్యాణ్ ఏదైనా విమర్శలు చేస్తే వెంటనే రంగంలోకి దిగి కౌంటర్లు ఇస్తున్న వైసీపీ మంత్రుల్లో అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా ముందుంటున్నారు. వీరిలో దాడిశెట్టి రాజా మినహా మిగిలిన ఇద్దరికి ప్రస్తుతం తమ నియోజకవర్గాల్లో చుక్కలు కనిపిస్తున్నాయి. వీరితో పాటు మాజీ మంత్రి పేర్నినానికి సైతం ఇదే పరిస్ధితి. అంబటి, అమర్నాథ్ వంటి వారు నియోజకవర్గాలు మారిపోయేందుకూ రెడీ అవుతున్నారు. దీంతో మిగిలిన వైసీపీ కాపు ఎమ్మెల్యేలు కూడా పరిస్దితిని గమనించి సైలెంట్ అయిపోతున్నారు.

పవన్ కు మద్దతుగా జోగయ్య ఎత్తులు
వచ్చే ఎన్నికల్లో కింగ్ మేకర్ కావడం ఖాయమని భావిస్తున్న పవన్ కళ్యాణ్ ను కింగ్ గా మార్చేందుకు మాజీ మంత్రి, కాపు నేత హరిరామజోగయ్య తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో ఆయనకు ఎలాంటి భయాలు, అనుమానాలు కూడా లేవు. చాలా స్పష్టంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఇప్పటికే క్షేత్రస్దాయిలో నేతల్ని ఆయన కూడగడుతున్నారు. అలాగే వచ్చే ఎన్నికల నాటికి పవన్ కళ్యాణ్ జనసేనను బలీయ శక్తిగా మార్చేందుకు జోగయ్య తాజాగా మరో ఎత్తు కూడా వేశారు.

జనసేనకు కాపు సేన మద్దతు ప్రకటన
వచ్చే ఎన్నికల్లో జనసేనకు మద్దతుగా నిలవాలని హరిరామజోగయ్యకు చెందిన కాపు సంక్షేమ సేన నిర్ణయించింది. ఈ మేరకు జోగయ్య ఓ ప్రకటన విడుదల చేశారు. జనసేనతోనే కాపు సంక్షేమ సేన ఉంటుందని కాపు సంక్షేమసేన వ్యవస్ధాపక అధ్యక్షుడు జోగయ్య తాజాగా ప్రకటించారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ కు జోగయ్య లేఖ కూడా రాశారు. కాపులతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల సంక్షేమమే తమ సేన ప్రధాన లక్ష్యమన్నారు. సంక్షేమ సేన సభ్యులందరూ జనసైనికులేనన్నారు.

పవన్ కు అధికారమే లక్ష్యమన్న జోగయ్య
పవన్ కళ్యాణ్ కు అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా కాపు సంక్షేమ సేన పనిచేస్తుందని జోగయ్య ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అదే లక్ష్యంతో మిగతా కాపు సంఘాలు కూడా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత సీఎం..2019 ఎన్నికల్లో బీసీలకు నష్టం లేకుండా కాపు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పుడు నాటకాలాడుతున్నారన్నారు. దీనిపై ఇప్పటికే హైకోర్టులో పిటిషన్ కూడా వేసి పోరాడుతున్నట్లు జోగయ్య తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీలో కాపు నేతలపై ఒత్తిడి పెంచేందుకే ఆయన బహిరంగంగా పవన్ కళ్యాణ్ కు, జనసేనకు మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!!












Click it and Unblock the Notifications