శ్వేతాబసు సవాల్: విడుదల చేయాలని కోర్టు, ఊరట
హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటి శ్వేతాబసుకు బుధవారం ఊరట లభించింది. శ్వేతాబసును రెస్క్యూ హోం నుండి వెంటనే విడుదల చేయాలని, తల్లికి అప్పగించాలని హైదరాబాదులోని నాంపల్లి న్యాయస్థానం ఆదేశించింది. ఆమెను రెస్క్యూ హోంలోనే ఉంచాలని ఎర్రమంజిల్ కోర్టు గతంలో తీర్పు చెప్పింది. ఈ తీర్పును శ్వేతాబసు సవాల్ చేస్తూ నాంపల్లి కోర్టులో అప్పీల్ చేసింది. శ్వేతాబసు దాదాపు రెండు నెలల క్రితం వ్యభిచారంలో పట్టుబడ్డ విషయం తెలిసిందే.

కాగా, తన కూతురును అప్పగించాలని శ్వేతాబసు తల్లి నెలన్నర క్రితం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక నుంచి తమ కుమార్తెను జాగ్రత్తగా చూసుకుంటామని, ఆమెను వెన్నంటి ఉంటానని ఆమె ఎర్రమంజిల్ కోర్టుకు తెలిపారు. దీంతో జడ్జి శ్వేతబసును కూడా విచారించారు. అమె తల్లితో వెళ్లేందుకు అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, కోర్టు శ్వేతను మరో మూడు నెలలు రెస్క్యూ హోంకే పరిమితం చేసింది. దీనిని శ్వేతాబసు నాంపల్లి కోర్టులో సవాల్ చేశారు.
ఇదిలా ఉండగా, శ్వేతబసు ప్రసాద్ మంచి ఫొటోగ్రాఫర్ కూడా. రూమీ అనే పర్షియన్ కవికి ఆమె అభిమాని. హైదరాబాదులోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో ఆమె గతంలో తాను తీసిన ఫొటోలతో ఓ ప్రదర్శన నిర్వహించింది. దైనందిన జీవితానికి, ప్రకృతికి సంబంధించి ఆమె అందమైన ఛాయాచిత్రాలు తీసింది. తన షోకు ఆమె రూమీ అని పేరు పెట్టుకుంది.
ప్రతి ఫోటో కింద రూమీ స్టాంజాలను ఇచ్చారు. 2012 నవంబర్‌లో ఆమె ఛాయాచిత్రాల ప్రదర్శన జరిగింది. సినీ పరిశ్రమకు రాక ముందు ఆమెకు ఫొటోగ్రఫీ ఓ హ్యాబీ, ఫ్యాషన్ కూడా. పర్యటనలకు వెళ్లినప్పుడు సరదాగా అహ్లాదకరమైన చిత్రాలను తన కెనన్ డి 1000 కెమెరాలో బంధించారు.
శ్వేత కుటుంబ సభ్యులు ఆ చిత్ర ప్రదర్శనను ప్రారంభించారు. రూమీ 13వ శతాబ్దానికి చెందిన కవి. ఆయన రచనలు తనకు ఎంతో ఇష్టమని ఆమె అప్పట్లో చెప్పారు. రూమీ 805వ పుట్టిన రోజు సందర్భంగా ఆమె ఫోటో ప్రదర్శనను పెట్టారు. ఈ ఫొటోగ్రఫీ ప్రదర్శనకు వచ్చిన డబ్బును హీల్ చిల్డ్రన్ చారిటీకి విరాళంగా ఇచ్చారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..!












Click it and Unblock the Notifications