టీడీపీకి ఈసీ భారీ షాక్-చంద్రబాబు హోదాకూ ముప్పు ! సాయిరెడ్డి బ్యాండ్ మొదలు !
ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తూ ఓ దశలో రాష్ట్ర విభజన తర్వాత ఏపీ,తెలంగాణలో శాఖలు విభజించి జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న టీడీపీకి ఈసీ భారీ షాక్ ఇచ్చింది. తాజాగా సీఈసీ విడుదల చేసిన నోటిఫికేషన్ లో ఈ మేరకు క్లారిటీ ఇచ్చేసింది. సీఈసీ ఇచ్చిన క్లారిటీతో టీడీపీ అధినేత చంద్రబాబు హోదాకూ మప్పు వచ్చి పడింది. దీంతో ఇదే అదనుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ ట్వీట్ల వర్షం మొదలుపెట్టేశారు.
టీడీపీకి ఈసీ భారీ షాక్
ఇన్నాళ్లూ ఏపీలో పూర్తిస్దాయిలో, తెలంగాణలో పాక్షికంగా రాజకీయాలు చేస్తూ వస్తున్న టీడీపీ తమది జాతీయ పార్టీగా చెప్పుకుంటోంది. మరే రాష్ట్రంలోనూ టీడీపీ కార్యకలాపాలు లేవు. అయినా జాతీయ పార్టీగా చెప్పుకుంటూ వస్తున్న టీడీపీకి ఈసీ తాజాగా షాక్ ఇచ్చింది. తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ లో వివిధ రాజకీయ పార్టీల తాజా హోదాల్ని స్పష్టం చేసింది. ఇందులో టీడీపీని కేవలం ప్రాంతీయ పార్టీగా మాత్రమే గుర్తిస్తూ క్లారిటీ ఇచ్చేసింది. వైసీపీ, టీఆర్ఎస్, జనసేన తరహాలోనే టీడీపీ కూడా ప్రాంతీయ పార్టీ మాత్రమేనని తేల్చిచెప్పేసింది.

జాతీయ పార్టీ డొల్ల వాదన
వాస్తవానికి సీఈసీ ఇప్పుడు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల జాబితా తాజాగా విడుదల చేసింది. అయితే గతంలో చూసుకున్నా ఎప్పుడూ టీడీపీ జాతీయ పార్టీగా లేదు. ఓ రాజకీయ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించాలన్నా, గుర్తించాలన్నా ఈసీకి కొన్ని నిబంధనలు ఉన్నాయి.వాటిని టీడీపీ ఎప్పుడూ సంతృప్తి పరచలేదు. దీంతో టీడీపీ జాతీయ పార్టీ అనే చర్చకే తావులేదు. కానీ టీడీపీ నేతలు మాత్రం మాది జాతీయ పార్టీ అనే చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు సీఈసీ ఇచ్చిన క్లారిటీతో ఆ చర్చకు తెరపడినట్లయింది.

చంద్రబాబు, లోకేష్ ల హోదా గల్లంతు
ఇప్పటివరకూ టీడీపీని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న జాతీయ పార్టీగా చెప్పుకుంటూ దానికి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబుకు ఇప్పుడు సీఈసీ ఇచ్చిన క్లారిటీతో ఆ హోదా వదులుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షుల్ని నియమించిన టీడీపీ.. చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకుంది. అంతే కాదు చంద్రబాబు తనయుడు లోకేష్ ను జాతీయ కార్యదర్శిగా కూడా ఎంచుకున్నారు. ఇప్పుడు ఈసీ క్లారిటీతో ఈ హోదాలన్నీ గల్లంతైనట్లేనన్న చర్చ జరుగుతోంది.

జాతీయయ పార్టీ కావాలంటే
మన దేశంలో ఓ రాజకీయ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోవాలంటే కనీసం మూడు వేర్వేరు రాష్ట్రాల్లో రెండు శాతం లోక్ సభ ఎంపీల్ని కలిగి ఉండాలి. అలాగే ఏదైనా సార్వత్రిక ఎన్నికల్లో లేదా అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6 శాతం ఓట్లు సాధించాలి. దీనికి తోడు నాలుగు లోక్ సభ సీట్లు కూడా కలిగి ఉండాలి. అలాగే నాలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీ గుర్తింపు సాధించి ఉండాలి. ఇవన్నీ సంతృప్తి పరిస్తేనే అప్పుడు ఓ రాజకీయ పార్టీకి ఈసీ జాతీయ పార్టీ హోదా కల్పిస్తుంది. కానీ టీడీపీకి వీటిలో కేవలం ప్రస్తుతం ఏపీలో మాత్రమే ఈ నిబంధనల్నీ సంతృప్తి పరిచే పరిస్ధితి ఉంది.

సాయిరెడ్డి సెటైర్లు మొదలు
సీఈసీ తన తాజా నోటిఫికేషన్ లో టీడీపీని కేవలం ప్రాంతీయ పార్టీల జాబితాలో మాత్రమే చేర్చడంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి తన మాటల దాడికి పదునుపెట్టారు. టీడీపీ జాతీయ పార్టీ అని వెబ్ సైట్లో పెట్టుకోవడానికి సిగ్గులేదా చంద్రబాబూ అంటూ మొదలుపెట్టిన సాయిరెడ్డి.. జాతి పార్టీ అని మార్చుకో.. లేదాతెలుగు డ్రామా అని మార్చుకో అంటూ సలహా ఇచ్చారు. ఎచ్చులు మానుకో.. ఇప్పటికైనా ఉప ప్రాంతీయ పార్టీ అని ఒప్పుకో అంటూ సాయిరెడ్డి చంద్రబాబును తన ట్వీట్ లో దెప్పి పొడిచారు.












Click it and Unblock the Notifications