జగన్ సర్కార్ కు హైకోర్టు మరో షాక్-సెకీ పవర్ కొనుగోళ్లపై నోటీసులు-కేంద్రం, అదానీకీ
ఏపీలో వైసీపీ ప్రభుత్వం సౌర విద్యుత్ కొనుగోళ్ల కోసం చేస్తున్న ప్రయత్నాలకు ఇవాళ ఎదురుదెబ్బ తగిలింది. సౌర విద్యుత్ కొనుగోళ్లను సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అదానీ పవర్ ద్వారా కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిపై విపక్షాల అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో సీపీఐ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు... జగన్ సర్కార్ తో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది.

సెకీ నుంచి విద్యుత్ కొనుగోళ్లు
కేంద్ర ప్రభుత్వ సంస్ధ అయిన సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా నుంచి భారీ ఎత్తన సౌర విద్యుత్ ను భారీ ధరలకు కొనుగోలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం గతంలోనే ఆమోదం తెలిపింది. దీని ప్రకారం ఏపీ ప్రభుత్వానికి సెకీ నుంచి తీసుకున్న విద్యుత్ ను అదానీ సంస్ధ సరఫరా చేయనుంది. ఇది కాస్తా మార్కెట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌర విద్యుత్ ధరల కంటే ఎక్కువగా ఉండటంతో సమస్య మొదలైంది. దీనిపై విపక్షాలు కూడా తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. అయినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు.

రూ.2.05 విద్యుత్ రూ.2.45కు కొనుగోలు
ప్రస్తుతం మార్కెట్లో సౌర విద్యుత్ యూనిట్ రూ.2.05కు దొరుకుతోంది. అయినా దాన్ని కొనకుండా కేంద్ర ప్రభుత్వ సంస్ధ సెకీ నుంచి అదానీ పవర్ తీసుకుని సరఫరా చేసే ధర రూ 2.45కు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో ఈ వ్యవహారంలో అవినీతి జరుగుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం అవేవీ లెక్కచేయకుండా ముందుకెళ్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని సవాల్ చేస్తూ సీపీఐ రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఇవాళ నోటీసులు జారీ చేసింది.
Recommended Video

జగన్ సర్కార్ కు నోటీసులు
మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు సెకీ నుంచి ఏపీ ప్రభుత్వం సౌర విద్యుత్ కొనుగోళ్లు చేపట్టడంపై సీపీఐ రామకృష్ణ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు ఇవాళ విచారించింది. ఎక్కువ ధరకు సౌర విద్యుత్ ఎందుకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని కోరుతూ జగన్ సర్కార్ కు నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో కేంద్రంతో పాటు అదానీ సంస్ధకు, రాష్ట్ర ఇంధన శాఖతో పాటు మొత్తం 10 మందికి నోటీసులు జారీ అయ్యాయి. దీంతో మార్కెట్ ధర కంటే ఎక్కువ ధరకు కొనుగోలు చేసేందుకు దారి తీసిన పరిస్ధితులపై వీరంతా హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సి ఉంది.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications