జగన్ సర్కార్ కు భారీ షాక్- విద్యుత్ బకాయిలపై ఈఆర్సీ ఘాటు లేఖలు-చెల్లించకపోతే నోటీసులు
ఏపీలో అంతకంతకూ పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలతో డిస్కంలు దివాళా తీసే పరిస్ధితులకు చేరుకుంటున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ జెన్ కో ను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చేసింది. దీంతో అధికారులు ఢిల్లీకి లాబీయింగ్ కోసం పరుగులు తీశారు. దీనిపై రేగిన కలకలం చల్లారకముందే పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ మరో సంచలనం రేపారు. డిస్కంలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలపై ఈఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాసిన లేఖల్ని ఆయన ఇవాళ బయటపెట్టారు.

డిస్కంలకు బకాయిలు
ఏపీలో విద్యుత్ ఉత్పత్తి సంస్ధలకు ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన బకాయిలు పేరుకుపోతున్నాయి. విద్యుత్ సంస్ధలు అప్పోసొప్పో చేసి విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలకు అందిస్తుండగా.. దానికి ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన బిల్లులు మాత్రం పెండింగ్ లో ఉండిపోతున్నాయి. దీంతో విద్యుత్ సంస్ధలు తెచ్చిన అప్పులకు వడ్డీలు, అసలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇదే క్రమంలో అవి దివాళా తీసే పరిస్ధితికి చేరుకుంటున్నాయి. దీంతో ఈ వ్యవహారం కేంద్రం వద్ద కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

జెన్ కోను నిరర్ధక ఆస్తుల్లో చేర్చిన కేంద్రం
తాజాగా ఏపీ జెన్ కో కేంద్రం వద్ద నుంచి తీసుకున్న అప్పులు తీర్చకపోవడం, గడువు ముగిసిన 90 రోజులకూ స్పందించకపోవడంతో కేంద్రం దాన్ని నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చింది. దీంతో జెన్ కోకు అప్పులు చెల్లించే స్తోమత కూడా లేకుండా పోయిందా అన్న చర్చ మొదలైంది. అలాగని ప్రభుత్వం ఆదుకుని జెన్ కో అప్పులు తిరిగి చెల్లించే పరిస్ధితి ఉందా అంటే అదీ లేదు. దీంతో కేంద్రం తీసుకునే చర్యలకు ఏపీ సర్కార్ కూడా వంత పాడక తప్పని పరిస్ధితి నెలకొంది. దీంతో కేంద్రం వద్ద లాబీయింగ్ చేసేందుకు అధికారులు ఢిల్లీ వెళ్లారు. నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చిన సంస్ధల్ని కేంద్రం ప్రైవేటీకరిస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంలోనూ కలకలం రేపుతోంది.

డిస్కంల బకాయిలపై ఈఆర్సీ సీరియస్
డిస్కంలకు పేరుకుపోతున్న బకాయిలపై తాజాగా స్పందించిన ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఈఆర్సీ.. డిస్కంలకు ఘాటుగా లేఖలు రాసింది. దీనిపై ఇప్పుడు రాష్టంలో చర్చ జరుగుతోంది. డిస్కంలకు ప్రభుత్వం నుంచి బకాయిలు పేరుకుపోతున్నా తగిన చర్యలు తీసుకోకపోవడంపై ఈఆర్సీ సీరియస్ అయింది. ఇదే పరిస్ధితి కొనసాగితే డిస్కంలు దివాళా తీయడం ఖాయమని అభిప్రాయపడింది. దీంతో డిస్కంలకు ఈఆర్సీ రాసిన లేఖలపై ఇప్పుడు ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాల్సిన అవసరం ఏర్పడింది.

పయ్యావుల ఫిర్యాదుపై స్పందన
ఏపీ ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తాజాగా హైదరాబాద్ వెళ్లి ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ను కలిసి వచ్చారు. ఈ నెల 9వ తేదీ ఏపీ ఈఆర్సీని కలిసి ఇంధన శాఖలో పరిస్థితులు, నిర్ణయాలపై పయ్యావుల ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో డిస్కంలపై పడుతున్న ప్రభావాన్ని ఈఆర్సీకి తగిన ఆధారాలతో వివరించారు. దీంతో పయ్యావుల ఫిర్యాదుపై స్పందించిన ఈఆర్సీ డిస్కంలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ, ఇంధన శాఖ కార్యదర్శికీ లేఖలు రాసింది. ఇందులో పలు కీలక అంశాల్ని సైతం ప్రస్తావించింది. ఈ అంశాలు రాజకీయంగా కాకరేపేలా ఉన్నాయి.

సర్కార్ కు డిస్కంలు నోటీసులు పంపాలన్న ఈఆర్సీ
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి ఏపీఈఆర్సీ రాసిన లేఖలో పలు కీలక అంశాలు ఉన్నాయి. డిస్కంలకు చెల్లించాల్సిన వేల కోట్ల సబ్సిడీ బకాయిల పెండింగ్ పై ఈ లేఖలో ప్రస్తావించారు.
మొత్తం రూ.25,257 కోట్ల బకాయిలపై ఈఆర్సీ రాసిన లేఖను పయ్యావుల కేశవ్ ఇవాళ బయట పెట్టారు. ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన రూ.15,474 కోట్ల సబ్సిడీ బకాయలు వెంటనే చెల్లించాలని ఇందులో ఆదేశించారు. అలాగే స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన 9783 కోట్ల ను విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చారు. బకాయిల చెల్లింపులపై 14 రోజుల గుడువుతో నోటీసులు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల నుంచి 14 రోజుల్లో స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపేయాలని ఆదేశించారు. ప్రభుత్వ తీరుతో డిస్కంల మనుగడే ప్రమాదంలో పడిందని లేఖలో ఈఆర్సీ పేర్కొంది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications