Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కల్యాణ్‌కు బిగ్ షాక్..?

టికెట్ల పంచాయితీ టీడీపీ , జనసేన పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటించిన దగ్గర నుంచి రాష్ట్రంలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది. ఈ రెండు పార్టీల్లో అసమ్మతి ఒక్కసారిగా బయటపడింది. టీడీపీ , జనసేన పార్టీల్లో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్ళగక్కుతున్నారు. ముఖ్యంగా టీడీపీలో అసంతృప్తి జ్వాలలు ఎక్కువయ్యాయి.

బండారు సత్యానారాయణ మూర్తి, నాగేశ్వర రావు ,బోడే ప్రసాద్ , వర్మ గంటా శ్రీనివాసరావు , గండి బాబ్జీ , పాసర్ల ప్రసాద్, జవహర్ వంటి సీనియర్ నేతలకు టికెట్ల దక్కని పరిస్థితి. వీరంతా కూడా బహిరంగంగానే టీడీపీ అధిష్టానంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వీరిలో కొంతమంది టీడీపీకి రాజీనామా కూడా చేశారు. ఇక పవన్ కల్యాణ్ జనసేన పార్టీలో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది.

Big shock to Pawan Kalyan key leader quit from janasena

పార్టీ కీలక నేత బొలిశెట్టి సత్యనారాయణ టికెట్ దక్కకపోవడంతో కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్డం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదంటూ తన బాధను బయటపెట్టారు. ఇదిలా ఉంటే తాజాగా జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. మరో కీలక నేత జనసేనకు రాజీనామా చేశారు. జనసేన అనకాపల్లి నియోజకవర్గ ఇంచార్జ్‌ పరుచూరి భాస్కరరావు పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు.

Big shock to Pawan Kalyan key leader quit from janasena

టికెట్ కోసం ప్రయత్నించి..నిరాశ చెందానని ఇక జనసేన నుంచి బయటకు రావడమే ఉత్తమం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నానని పరుచూరి భాస్కరరావు తెలిపారు. అనకాపల్లి టికెట్‌ను ఇటీవల పార్టీలో చేరిన కొణతాల రామకృష్ణకు కేటాయించడంతోనే పరుచూరి భాస్కరరావు జనసేనకు గుడ్ బై చెప్పినట్టుగా తెలుస్తోంది. ఆయన త్వరలోనే తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+