వైఎస్ జగన్‌తో కుమార మంగళం బిర్లా భేటీ: చడీ చప్పుడు లేకుండా! పెట్టుబడులు పెడతారా?
Recommended Video
అమరావతి: దేశ పారిశ్రామిక దిగ్గజం, ఆదిత్య బిర్లా గ్రూప్ సంస్థల ఛైర్మన్ కుమార మంగళం బిర్లా రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 26వ తేదీన వైఎస్ జగన్ చేపట్టిన ఢిల్లీ పర్యటన సందర్భంగా కుమార మంగళం బిర్లా ఆయనను కలిశారు. వైఎస్ జగన్‌ను కలుసుకోవడానికి ఆయన స్వయంగా ఏపీ భవన్‌కు వచ్చారు. ఆ సమయంలో బిర్లా వెంట.. ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ఉన్నారు.
ఈ భేటీకి ఎలాంటి ప్రాధాన్యత లేదని చెబుతున్నప్పటికీ.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి ఆయన వైఎస్ జగన్‌ను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏఏ జిల్లాల్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే విషయం ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ- రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల్లో పెట్టుబడులు పెట్టాలని సూచించినట్లు తెలిసింది. దీనివల్ల రాష్ట్రంలో పారిశ్రామిక వికేంద్రీకరణ ఏర్పడుతుందని, అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని వైఎస్ జగన్ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.

వచ్చే మూడేళ్లలో ఒక్క గుజరాత్‌లోనే 15 వేల కోట్ల రూపాయల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు కొద్దినెలల కిందట కుమార మంగళం బిర్లా ప్రకటించిన విషయం తెలిసిందే. జౌళి, రసాయన పరిశ్రమల్లో భారీ ఎత్తున ఆయన పెట్టుబడులు పెట్టబోతున్నారు. తమ సంస్థల కార్యకలాపాలను విస్తరింపజేయడానికి ఏపీకీ ప్రాధాన్యత ఇస్తామని ఆయన ఈ సందర్భంగా వైఎస్ జగన్‌కు హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కుమార మంగళం బిర్లా సంస్థకు చెందిన అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారాలు ఉన్నాయి. వాటి వల్ల స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తున్నాయి. వాటితో పాటు టెక్స్‌టైల్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలని కుమార మంగళం బిర్లా భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయన వైఎస్ జగన్ వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications