కొడాలి నాని పై టీడీపీ అభ్యర్ధి ఫిక్స్ : అనూహ్య ఎంపిక : ఇదీ లెక్క - హోరా హోరీ..!!
రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయంగా హాట్ సెంటర్ గుడివాడ. అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడూ సంచలనమే. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రి గా..వైసీపీ ఫైర్ బ్రాండ్ గా టీడీపీ పైన.. ఆ పార్టీ అధినేత చంద్రబాబు - లోకేష్ ను టార్గెట్ చేసారు. సందర్బం వచ్చిన ప్రతీ సారి విరుచుకుపడుతున్నారు.
దీంతో..వచ్చే ఎన్నికల్లో గుడివాడలో ఎలాగైనా కొడాలి నాని కి ధీటుగా బలమైన అభ్యర్ధిని నిలబెట్టి..విజయం సాధించాలనేది టీడీపీ లక్ష్యం. ఇందుకోసం పలు సర్వేలు చేసింది. అయితే, ప్రస్తుతం గుడివాడలో పార్టీలో అక్కడ క్రియాశీలకంగా ఉన్న నేతలు కాకుండా.. అనూహ్యంగా కొత్త అభ్యర్ధిని బరిలోకి దించనున్నారు.

కొడాలి నాని తో ఢీ కొట్టాలంటే
ఇందు కోసం కొద్ది రోజులుగా టీడీపీ పలు రకాలుగా చర్చలు చేసింది. గుడివాడలో ఓట్లు..సామాజిక సమీకరణాలను లెక్కలోకి తీసుకుంది. దీని కోసం తాము ఎంపిక చేసిన అభ్యర్ధితో పలు దఫాలుగా మంతనాలు జరిపింది. ఫైనల్ గా కొడాలి నాని పైన అభ్యర్ధి డిసైడ్ చేసింది. కొడాలి నాని పైన టీడీపీ అభ్యర్ధిగా వంగవీటి రాధా ను పోటికి దింపాలని టీడీపీ నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం.
అయితే, దీని పైన వంగవీటి రాధా తన తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఆ తరువాతనే టీడీపీ అధికారికంగా తమ అభ్యర్ధిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ ఎంపిక వెనుక టీడీపీ సర్వేలు - లెక్కలతో కసరత్తు చేసింది. గుడివాడ పరిధిలో దాదాపు 30వేల కాపు సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయి. జిల్లాలో వంగవీటి కుటుంబానికి ఉన్న ప్రాధాన్యత కలిసి వస్తుందని టీడీపీ నమ్ముతోంది.

రాధా తుది నిర్ణయం పెండింగ్
దీంతో..కొడాలి నానిని ఢీ కొట్టే సరైన అభ్యర్ధి రాధా అనే నిర్ణయానికి వచ్చింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కొడాలి నానికి 89833 ఓట్లతో 53.50% శాతం ఒట్లు సాధించారు. కాగా, ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన దేవినేని అవినాశ్ కు 70354 ఓట్లతో 41.90 శాతం ఓటింగ్ షేర్ సాధించారు.
నియోజకవర్గంలో 30 వేలకు పైగా కాపు సామాజిక వర్గ ఓట్లు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాపు వర్గ ఓట్లు ఎక్కువ శాతం కొడాలి నానికి పోల్ అయినట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ప్రతిపాదన వచ్చిన సమయంలో వంగవీటి రాధా అంగీకరించలేదని.. విజయవాడ తూర్పు సీటు పైన పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
అయితే, గుడివాడ సీటు పార్టీకి ప్రతిష్ఠాత్మకమని.. సహకరించాలని కోరినట్లుగా సమాచారం. అయితే, దీని పైన వంగవీటి రాధా తన తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. ఇక, జనసేన నుంచి ఈ సీటులో పొత్తు ఉన్నా.. లేకున్నా పరోక్షంగా సహకారం లభించేలా మంతనాలు సాగించే అవకాశం కనిపిస్తోంది.

అంగీకరిస్తే..ఇక హోరా హోరీనే
పొత్తు ఉంటే రాధాకు జనసేన నుంచి అధికారికంగా మద్దతు లభించటం కష్టం కాదు. అదే విధంగా.. పొత్తు కుదరని సమయంలోనూ తమ వ్యూహం అమలు చేసేలా టీడీపీ కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ కసరత్తులో భాగంగానే..గుడివాడలో మహానాడు సైతం వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో నియోజకవర్గ నేతల మధ్య ఉన్న విభేదాలు..కొడాలి నాని తో ఢీ కొట్టాలంటే అన్ని సమీకరణాలు కీలకమని టీడీపీ భావిస్తోంది.
టీడీపీ అంచనా వేస్తున్నట్లుగా.. వంగవీటి రాధా..గుడివాడ నుంచి పోటీకి చివరి నిమిషంలో అంగీకరిస్తే.. ఇద్దరు మిత్రుల మధ్య గుడివాడ కేంద్రంగా బిగ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఈ వ్యవహారం హట్ టాపిక్ గా మారుతోంది. త్వరలోనే దీని పైన అధికారికంగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications