చంద్రబాబు అంటే బిల్‌గేట్స్‌కు ప్రత్యేకాభిమానం, మేధా టవర్స్‌లో సచివాలయం
హైదరాబాద్: తమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అంటే సాప్ట్‌వేర్ దిగ్గజం బిల్‌గేట్స్‌కు ప్రత్యేక అభిమానం ఉందని సత్య నాదెళ్ల చెప్పారని ఆంధ్రప్రదేశ్ ఐటి శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
సత్య నాదెళ్లతో చంద్రబాబు భేటీ చరిత్రాత్మకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏపీలో ఐటీ అభివృద్ధికి సహకారిస్తామని సత్యనాదెళ్ల చెప్పారని తెలిపారు. విద్య, వైద్య రంగాల్లో మైక్రోసాఫ్ట్ సహకారం ఉంటుందని సత్య నాదెళ్ల భరోసా ఇచ్చారని పల్లె చెప్పారు. అనంతపురంలో పర్యటించాలని కోరానని దానికి ఆయన అంగీకరించారని పల్లె చెప్పారు.

గన్నవరం మేధా టవర్స్‌ను ఐటి సెజ్‌గా డీనోటిఫై చేసినట్లు ఆయన తెలిపారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయం కోసం వాడాలని నిర్ణయించుకోవడంతో డీనోటిఫై చేశారు. ఇక అది ఐటి సేజ్ కాదని పల్లె చెప్పారు.
మేధా టవర్స్‌లో ఉన్న 2,3 కంపెనీలను అక్కడి నుంచి తరలించేందుకు సంప్రదింపులు జరుపుతున్నాని, ఆ కంపెనీలకు ప్రత్యామ్నాయ కేటాయింపుల ప్రక్రియ కొనసాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications