• search
For visakhapatnam Updates
Allow Notification  

  ఇలా కూడా మోసం చేయొచ్చు:విశాఖలో ఓ బయోమెడికల్‌ సంస్థ అక్రమాల దందా

  By Suvarnaraju
  |

  ప్రభుత్వ శాఖల్లో ప్రత్యేకించి వైద్య ఆరోగ్య శాఖల్లో అంతులేని నిర్లక్ష్యానికి అద్దం పట్టే మరో ఉదంతం ఇది. విశాఖపట్టణం కెజిహెచ్ ఆస్పత్రిని అడ్డాగా చేసుకొని ఓ బయో మెడికల్ సంస్థ పాల్పడుతున్న మోసాలను గమనిస్తే ఎవరైనా విస్తు పోవాల్సిందే!

  అక్రమంగా డబ్బు దండుకోవడానికి అసలు పరికరాలు లేకుండానే ఉన్నట్లుగా, ఉన్న పరికరాలను రెట్టింపు చేసి చూపిస్తూ, వాటికి మరమ్మత్తుల పేరుతో లక్షలకు లక్షలు దండుకొంటోంది. అంతేకాదు ఈ విధంగా అప్పనంగా ప్రభుత్వ ధనాన్ని దోచుకుతింటున్న ఛీటింగ్ సంస్థకు తమ అక్రమ వ్యవహారాలు వెలుగు చూస్తాయనే భయం కూడా లేనట్లుంది. కారణం అసలు పేపర్ల మీదే తప్ప వాస్తవంలో లేని ఆ పరికరాన్ని ఏకంగా సిఎం డ్యాష్ బోర్డులో సైతం ఉన్నట్లుగానే నమోదయ్యేలా చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

   కెజిహెచ్ లో...ఎంత మోసం

  కెజిహెచ్ లో...ఎంత మోసం

  విశాఖ కింగ్ జార్జ్ ఆస్పత్రికి మెడికల్ పరికరాల మెయింటెనెన్స్ చూసే బయో మెడికల్ సంస్థ ఆ ఆస్పత్రిలోని రెండు వెంటిలేటర్లు ట్యాగ్‌ నెంబర్లు: 8907471-ఏపీ3జెడ్‌-వీఎస్‌జీ-00063, 8907471-ఏపీ3జెడ్‌-వీఎస్‌జీ-00587 కు గత కొన్ని నెలలుగా మరమ్మతులు చేస్తున్నట్లు నెలనెలా బిల్లు వేసి డబ్బులు దండుకుంటోంది. అయితే విచిత్రమైన విషయం ఏమిటంటే అసలు ఆ నంబర్లతో కెజిహెచ్ లో ఏ వెంటిలేటర్లు లేకపోవడం. అలాగే మరో పరికరం విషయంలో ఇంకా పెద్ద దందాకు పాల్పడుతోంది ఇదే సంస్థ.

  ఎన్ని దందాలో...ఎన్ని వెరైటీలో

  ఎన్ని దందాలో...ఎన్ని వెరైటీలో

  కెజిహెచ్ లోని ఛాతీ అంటువ్యాధుల ఆసుపత్రిలో మరో ఖరీదైన వెంటిలేటరు ఉందట. దాని ట్యాగ్‌నెంబరు 8907471-ఏపీ3జెడ్‌-వీఎస్‌ఎస్‌-00717 గా పేర్కొన్న ఈ బయో మెడికల్ సంస్థ దానికి కూడా మరమ్మత్తుల పేరుతో బిల్లులు పెడుతోంది. అసలు ఈ ట్యాగ్ నెంబరుతో కెజిహెచ్ ఆసుపత్రిలో ఎలాంటి పరికరం లేదు. విచిత్రం ఏంటంటే అసలు హాస్పిటల్ లో లేని ఈ పరికరాన్ని సీఎం డ్యాష్‌బోర్డులో మాత్రం ఉన్నట్లుగా చూపినట్లు సమాచారం. మరో వింతైన విషయం ఏమిటంటే ఏక విభాగంగా ఉన్న కెజిహెచ్ ఆస్పత్రిని 1,2 రెండు భాగాలుగా ఉన్నట్లు పేర్కొని రెండో ఆసుపత్రిలో ఈ పరికరం ఉన్నట్లుగా చూపించారంటే ఆ బయో మెడికల్ సంస్థ తెంపరితనం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా దీన్ని 2014 జూన్‌ 1న కొనుగోలు చేసినట్లుగా తేదీలు కూడా వేశారు. అంటే ఆ మేరకు ఈ పరికరం కొనుగోలు పేరుతో కూడా దందా జరిగినట్లు అర్థం అవుతోంది.

   మరికొన్ని...విచిత్రాలు

  మరికొన్ని...విచిత్రాలు

  అంతేకాదు ఈ ఆస్పత్రిలో ఇలాంటి విచిత్రాలు చాలా ఉన్నాయి. ట్యాగ్‌నెంబరు 8907471-ఏపీ3జెడ్‌-వీఎస్‌జీ-00073. కేజీహెచ్‌లో సూదులు కత్తిరించేందుకు ఏర్పాటుచేసిన ఓ నీడిల్‌ కట్టర్ పరికరం‌. శస్త్రచికిత్సలు చేసినపుడు, ఎవరికైనా సూది ఉపయోగించినపుడు ఇంజక్షన్‌ చేశాక...ఆ సూదిని విరవడానికి వాడే పరికరం ఇది. దీని ఖరీదు మహా అయితే రూ. 6000 ఉండొచ్చు. కానీ ఈ ట్యాగ్‌ నెంబరును ఒక వెంటిలేటరుగా చూపించి...దాని ధర రూ. 11 లక్షల రూపాయలుగా పేర్కొంటూ ఆ బిల్లులో 10 శాతం సొమ్మును నిర్వహణ ఖర్చు కింద కాంట్రాక్ట్ సంస్థ వసూలు చేసుకుంటోంది. ఇలాగే ట్యాగ్‌ నెంబరు 8907471-ఏపీ3జెడ్‌-వీఎస్‌జీ-00060 ఉన్న రూ.20 వేల ఖరీదు చేసే ఫోటోథెరపీ మిషన్ ను మరో వెంటిలేటర్ గా, దాని ఖరీదు కూడా రూ.11 లక్షలుగా చూపి మెయింటెనెన్స్ కింద 10 శాతం సొమ్ము లాగేస్తోంది.

   నిర్లక్ష్యమా...సహకారమా

  నిర్లక్ష్యమా...సహకారమా

  ఇలా విశాఖ నగరం మొత్తం మీద 16 వెంటిలేటర్లను రిపేర్ చేస్తున్నట్లు పేర్కొంటూ ఆ సంస్థ భారిగా డబ్బు దండుకుంటోంది. దీన్ని బట్టి అందులో అసలు వాస్తవంగా మనుగడలో ఎన్ని వెంటిలేటర్లు ఉన్నాయో తెలియని పరిస్థితి. ఒకవేళ ఆ వెంటిలేటర్ ఉన్నా దాని అసలు ఖరీదు రూ. 9 లక్షల రూపాయలు మించి ఉండదట. అంటే వాటి కొనుగోలు లోనూ లక్షల రూపాయలు కుంభ కోణం జరిగినట్లు అర్థమవుతోంది. అంతేకాదు ఇంకా వారంటీ పీరియడ్ ఉన్నా వీటికి రిపేర్ వచ్చినట్లు చూపి ఈ సంస్థకే డబ్బులు ముట్టచెప్పడం విశేషం. దీన్ని బట్టి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నట్లో లేక అక్రమార్కులతో కుమ్మక్కయినట్లో స్పష్టంగా వెల్లడైపోతోంది. మరి ఈ ఒక్క విశాఖలోనే ఈ స్థాయిలో అవినీతి వెలుగు చూస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆస్పత్రులలోని పరిస్థితి ఎలా ఉందో విచారణ జరపక తప్పదు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  మరిన్ని విశాఖపట్నం వార్తలుView All

  English summary
  A Bio medical company illegally making lakhs of rupees in the name of handling medical devices in KGH. It is noteworthy that the various devices that are reported by company are not in the hospital.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more