Birdflu Effect: బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన చికెన్ అమ్మకాలు!
Birdflu Effect: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ భయాందోళనను కలిగిస్తోంది. కొన్ని వారాలుగా చాలా ప్రాంతాల్లోని కోళ్ల ఫారాల్లో కోళ్లకు వైరస్ సోకి పెద్ద ఎత్తున మృత్యువాత పడుతుండడంతో చికెన్ తినేందుకు ప్రజలు భయపడుతున్నారు. కోళ్ళ ఫారాల్లో లక్షల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ ధరలు భారీగా తగ్గినా.. భయంతో చాలా వరకు చికెన్ తినేందుకు ఇష్టపడడం లేదు. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో హైదరాబాద్ చికెన్ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి. బర్డ్ ఫ్లూ భయంతో ప్రజలు మటన్, చేపల వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే మటన, చేపలకు భారీగా గిరాకీ పెరిగిపోయింది.
తెలంగాణ ప్రభుత్వం అలర్ట్..
పెద్ధ ఎత్తున కోళ్లు మృత్యువాత పడుతుండడంతో తెలంగాణ సర్కారు అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. నాణ్యతగా లేని చికెన్ విక్రయిస్తున్న వ్యాపారులపై ఫుడ్ సేఫ్టే విభాగం కొరడాను ఝులిపిస్తోంది. ఎన్నిసార్లు హెచ్చరించినా వ్యాపారుల ధోరణి మారకపోవడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పటాన్ చెరులోని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇన్ స్టా హాట్ ఫుడ్స్, రాజ్ కుమార్ రోలర్ ఫ్లోర్ మిల్స్ ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించడం లేదని అధికారులు తేల్చారు. గడువు ముగిసిన మెంతులు, ఆవాలను వాడుతున్నారని.. ప్రాసెసింగ్ యూనిట్ లో బొద్దింకలు, పురుగులు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు రసూల్ పురాలోని అన్నా నగర్ లో చికెన్ షాపుల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీలు పలు షాపుల్లో కుళ్లిన చికెన్ భారీగా బయటపడినట్లు తెలిసింది. సుమారుగా 500 క్వింటాలకు పైగా కుళ్లిన చికెన్ ను చూసి అధికారులు షాక్ అయ్యారు. వ్యాపారులపై కేసు నమోదు చేసిన అధికారులు.. కుళ్లిన చికెన్ అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ
ఏపీలో బర్డ్ ఫ్లూ సోకి 5 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు ఆ రాష్ట్ర సర్కారు పేర్కొంది. దీంతో ఏపీలోని పలు జిల్లాల్లో చికెన్ తినడాన్ని నిషేధించారు. ఈ క్రమంలో ఏపీలో చికెన్ విక్రయాలు సగానికి పైగా తగ్గిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోంది. ఫారాల్లో పెంచుతున్న కోళ్లు ఎక్కువగా బర్డ్ ఫ్లూ సోకి మరణిస్తున్నాయి. బర్డ్ ప్లూ సాధారణంగా జంతువులు, పక్షుల నుంచి మనుషులకు సోకుతుంది. కోళ్ల నుంచి అధికంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. బర్డ్ ఫ్లూ సోకిన జంతువులు, పక్షులకు దగ్గరగా ఎక్కువ సేపు ఉన్నా ఇది వస్తుంది. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్లను తిన్నా మనుషులకు వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. చికెన్ ను బాగా శుభ్రం చేసి ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. ఉడికి ఉడకని చికెన్ తిన్నా వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అందుకే బర్డ్ ఫ్లూ కొన్ని రోజుల పాటు చికెన్ తినకపోవడమే మంచిదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications