తెలంగాణకు చిక్కులేనా!: ఎఫ్ఐఆర్ లేకుండానే ఫోన్ ట్యాపింగ్
హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారంలో నిందితుల్లో ఒకరైన సెబాస్టియన్ ఫోన్‌ను తెలంగాణ ఏసీబీ ట్యాప్ చేసినట్లుగా ఏపీ పోలీసులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. అతని కాల్స్ రికార్డ్ చేశారని చెప్పేందుకు ఆధారాలున్నాయని ఏపీ పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండానే సెబాస్టియన్ ఫోన్ ట్యాపింగ్ చేశారని ఏపీ పోలీసులు గుర్తించారని తెలుస్తోంది. సాధారణంగా అనుమానితుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేశాకే ఏసీబీ ముందుకు వెళ్తుంది. కానీ, ఈ కేసులో అలా జరగలేదని పోలీసులు గుర్తించారని సమాచారం. ఎఫ్ఐఆర్‌కు ముందే ట్యాప్ చేశారని గుర్తించారు.

ఇదిలా ఉండగా, ఏపీ ప్రభుత్వం ఫోరెన్సిక్ లేబోరేటరీ మాజీ డైరెక్టర్ కేపీసీ గాంధీని అడ్వైజర్‌గా నియమించుకుంది. ఓటుకు నోటు వ్యవహారం నేపథ్యంలో ఆయనను నియమించారని తెలుస్తోంది. కేపీసీ గాంధీ గతంలో ఎన్నో కేసులు చేపట్టారు. కొన్నేళ్ల క్రితం బాలకృష్ణ నివాసంలో జరిగిన షూటింగ్ కేసును కూడా హ్యాండిల్ చేశారు.
గవర్నర్ మీద వ్యాఖ్యలపై తగ్గిన అచ్చెన్నాయుడు
గవర్నర్‌ను గంగిరెద్దు అన్న వ్యాఖ్యల పైన అచ్చెన్నాయుడు గురువారం వివరణ ఇచ్చుకున్నారు. తన వ్యాఖ్యలు గవర్నర్‌ను బాధిస్తే వెనక్కి తీసుకుంటున్నానని చెప్పారు. ఆయన పైన కోపంతో లేదా కక్షతో తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని, ఏపీకి అన్యాయం జరుగుతోందనే ఆవేదనతో చేసినవేనని చెప్పారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications