అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక సంస్థ..!!

ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మక సంస్థలు కొలువు తీరుతున్నాయి. ఇప్పటికే పలు విద్యా సంస్థలు సీఆర్డీఏతో చర్చలు చేసాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలకు స్థలాల కేటాయింపు పూర్తైంది. వచ్చే నెల నుంచి అమరావతిలో మధ్యలో నిలిచిన నిర్మాణాలు పూర్తి చేసే పనులు ప్రారంభం కానున్నాయి. అదే విధంగా అమరావతిలో భూ కేటాయింపుల పైన నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే అమరావతికి ప్రతిష్ఠాత్మక బిట్స్ సంస్థ తమ క్యాంపస్ ఏర్పాటుకు సిద్దమైంది.

అమరావతిలో బిట్స్
అమరావతి లో వేగంగా అడుగులు పడుతున్నాయి. మధ్యలో నిలిచిన పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతికి రుణం ఈ నెల చివరి వారంలో అధికారికంగా ఆమోదం పొందనుంది. అదే విధంగా ఇప్పటికే కేంద్రం అమరావతి నుంచి కొత్త రైల్వే లైన్ కు ఆమోదం తెలుపుతూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొన్ని ప్రఖ్యాత సంస్థలు అమరావతిలో నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. తాజాగా అమరావతి రాజధాని ప్రాంతంలో క్యాంపస్ ఏర్పాటుకు బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) ఆసక్తి వ్యక్తం చేసింది.

BITS planning to establish new campus in AP Capital Amaravati discussions with CRDA

50 ఎకరాల్లో ఏర్పాటు
అమరావతిలో క్యాంపస్ కోసం సీఆర్డీఏ అధికారులతో కలిసి భూములను బిట్స్ ప్రతినిధులు పరిశీలించారు. అమరావతి పరిధిలోని కురగల్లు, వెంకటాయపాలెంలోని స్థలాలను పరిశీలన చేసిన బిట్స్ ప్రతినిధులు సీఆర్డీఏ అధికారులతో చర్చలు చేసారు. రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న బిట్స్ విద్యాలయానికి ఇప్పటికే గోవా, హైదరాబాద్, దుబాయ్‌లలో క్యాంపస్‌లు ఉండగా, తాజాగా ఏపీ రాజధానిలోనూ క్యాంపస్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణం లో తమ క్యాంపస్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో బిట్స్ ఉంది.

అధికారిక నిర్ణయం
ప్రస్తుతం ఎస్ఆర్ఎం కొనసాగు తున్న ప్రాంతంలో తమ క్యాంపస్ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, స్థలం పరిశీలించిన బిట్స్ ప్రతినిధులు సీఆర్డీఏ తో చర్చల సారాంశాన్ని తమ యాజమాన్యంకు వివరిస్తా మని వెల్లడించారు. ఆ తరువాత అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు పై బిట్స్ యాజమాన్యం తుది ప్రకటన చేసే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+