కిశోర్ బాబు ఎఫెక్ట్: మంత్రి అయ్యన్నకు చేదు అనుభవం
ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడికి గుంటూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆహ్వానం మేరకు అయ్యన్నపాత్రుడు పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి అయ్యన్నపాత్రుడికి గుంటూరు జిల్లాలో చేదు అనుభవం ఎదురైంది. మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆహ్వానం మేరకు అయ్యన్నపాత్రుడు పత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించారు.
ఈ సందర్భంగా మంత్రి అయ్యన్న కాన్వాయ్‌ను స్థానికులు అడ్డుకున్నారు. ఇంటి రుణాల మంజూరుకు కిషోర్ బాబు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ వ్యక్తులను కాదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని స్థానిక టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని ఈ పరిణామంతో అయ్యన్నపాత్రుడు ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్నారు. అనంతరం పోలీసులు వారిని చెదరగొట్టడంతో మంత్రి కాన్వాయ్ ముందుకు సాగింది.












Click it and Unblock the Notifications