బాబుకు నల్ల జెండాలు, జగన్ ఢిల్లీ పర్యటనపై యనమల

ప్రధానితో చర్చించాకే: యనమల
పార్టీ విలీనం, విధి విధానాల పైన చర్చించాకనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రితో భేటీకి సిద్ధమవుతున్నారని తెలుగుదేశం పార్టీ నేత యనమల రామకృష్ణుడు హైదరాబాదులో అన్నారు. సిబిఐ దర్యాఫ్తు చేస్తున్న తన ఆస్తుల కేసును తప్పు దారి పట్టించినందుకు కాంగ్రెసు అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పేందుకు ఆయన ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారని ఆరోపించారు.
కేంద్రం పైనే పోరాటం: పయ్యావుల
రాష్ట్ర విభజన నిర్ణయంపై తన పోరాటం కేంద్రం పైనేనని పయ్యావుల కేశవ్ వేరుగా అన్నారు. కేంద్రం, కాంగ్రెసు పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబడుతుందన్నారు. రాష్ట్ర విభజనపై తన వైఖరి పార్టీకి వ్యతిరేకం కాదని చెప్పారు.
మళ్లీ అఖిలపక్షం అవసరం లేదు: గాలి
మరోసారి అఖిల పక్ష సమావేశం అవసరం లేదని గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. ఐదారు నెలల్లో కొత్త ప్రభుత్వం వస్తుందని, విభజన సమస్యను కొత్త ప్రభుత్వమే పరిష్కరిస్తుందని చెప్పారు. టిడిపి హయాంలోనే అభివృద్ధి జరిగిందని గతంలో కెసిఆర్ చెప్పారని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications