మీరెందుకొచ్చారని రోజా, వైసీపీ ఎమ్మెల్యేలకి నిలదీత
గుంటూరు/అనంతపురం: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రోజా, ఇతర నేతలకు గుంటూరు జిల్లా తుళ్లూరులో సోమవారం చేదు అనుభవం ఎదురయింది. తుళ్లూరులో రాజధాని కోసం రైతుల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా భూమి తీసుకుంటుందని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతులను కలిసేందుకు రోజా సహా పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు.

వారిని రైతులు అడ్డగించారు. మీరు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. తమ గ్రామాల్లో రాజధాని రావడం మీకు ఎందుకు ఇష్టం లేదని ప్రశ్నించారు. దీంతో వైసీపీ నేతలు అవాక్కయ్యారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కొంత వాగ్వాదం జరిగింది.
అంతకుముందు రోజు మాట్లాడుతూ... వైసీపీ రాజధాని నిర్మాణానికి వ్యతిరేకం కాదని, కానీ బలవంతంగా రైతుల నుంచి భూములను ప్రభుత్వం లాక్కోవటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. ఏపీ రాజధాని ప్రాంతంలో వైసీపీ శాసనసభా పక్షం సభ్యులు పర్యటించారు. ఈ పర్యటనలో 26 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పుట్టపర్తిలో ఫ్లెక్సీ రగడ
అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో వైసీపీ, టీడీపీల మధ్య ఫ్లెక్సీ విషయమై గొడవ జరిగింది. పుట్టపర్తిలో జగన్ భరోసా యాత్రకు ముందు... అక్కడ ఉన్న టీడీపీ ఫ్లెక్సీలు చిరిగిపోయాయి. వాటిని గుర్తు తెలియని వ్యక్తులు చించేశారు. దీంతో జగన్ భరోసా యాత్ర నేపథ్యంలో వైసీపీ వారే చించేశారని టీడీపీ ఆరోపించింది.












Click it and Unblock the Notifications