కడప వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కడపలో వింత: భారీ శబ్దాలతో, అకస్మాత్తుగా 20 అడుగుల గోతులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

కడప: ఏపీలోని కడప జిల్లా సికె దిన్నె మండలం బుగ్గ అగ్రహారంలో గురువారం నాడు వింత చోటు చేసుకుంది. మల్లేశ్వర స్వామి ఆలయం సమీపంలో హఠాత్తుగా గోతులు ఏర్పడ్డాయి. పలుచోట్ల ఈ గోతులు ఏర్పడ్డాయి. దీంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.

ఆలయం వద్ద దాదాపు పదిహేను చోట్ల గోతులు ఏర్పడ్డాయి. ఇవి బావులను తలపిస్తున్నాయి. గుంతలు దాదాపు ఇరవై అడుగుల లోతు వరకు ఉన్నాయి. గుంతలు అకస్మాత్తుగా ఏర్పడుతుండటం, అవి ఏర్పడుతున్న సమయంలో భారీగా శబ్దాలు వస్తుండటంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు.

bizarre holes near Temple in Kadapa district!

మనుబోలు వద్ద వేగంగాజాతీయ రహదారి పునరుద్ధరణ పనులు

భారీ వర్షాలకు ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద కొట్టుకుపోయిన జాతీయ రహదారి పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను ఆంధ్రప్రదేశ్‌ రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవ రావు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

రహదారి 30 అడుగుల లోతుకు కోసుకుపోవడంతో పునరుద్ధరణ పనులు ఆలస్యం అవుతున్నట్లు మంత్రి శిద్ధా వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం తర్వాత ఈ మార్గంలో రాకపోకలు పునరుద్ధరిస్తామని శిద్ధా రాఘావ రావు చెప్పారు.

English summary
Nature's wonder – The bizarre holes near Temple in Kadapa district!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X