గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో వ్యాపారి హత్య

Bizman found bludgeoned to death at Hyderabad
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని మోతీనగర్‌లో ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు మోతీనగర్‌లోని ఇంటిలో అతన్ని హత్య చేశారు. మృతుడిని 36 ఏళ్ల అనిల్ కుమార్‌గా గుర్తించారు.

అతను చిన్నపాటి ప్లాస్టిక్ మౌల్డింగ్ యూనిట్‌ను నడుపుతున్నాడు. దుండగులు బుధవారం తెల్లవారు జామును ఇంటిలోకి ప్రవేశించి, భారీ వస్తువుతో తలపై మోది అనిల్ కుమార్‌ను హత్య చేసినట్లు సనత్‌నగర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ సి. హరిశ్చంద్రా రెడ్డి చెప్పారు.

తలపై తీవ్రమైన గాయం కావడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఉదయంపూట అనిల్‌ను కలవడానికి పొరుగువారు ఇంటికి వెళ్లడంతో సంఘటన వెలుగు చూసింది. పడకగదిలో రక్తం మడుగులో అనిల్ శవం పడి ఉండడాన్ని వారు చూశారు.

రెండేళ్ల క్రితం భార్య అతన్ని వదిలేసింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనిల్‌కు ఎవరైనా శత్రువులు ఉన్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లు, ఇప్పటి వరకు కేసుకు సంబంధించిన వివరాలు ఏమీ తెలియలేదని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+