విశాఖలో జగన్‌కు భూములు.. అందుకే రాజధాని ! ; పరిటాల రవిలా నన్ను చంపేస్తారేమో ? : ఆదినారాయణ రెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన సాగుతోందని బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి దుర్మార్గపు పాలనను ఎన్నడూ చూడలేదన్నారు. అధికారం కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కే వ్యక్తి జగన్ అని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అంటూ నాడు జనం నెత్తిన ముద్దులు పెట్టి.. అధికారంలోకి వచ్చాక పిడి గుద్దులు గుద్దుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ సీఎం కేసీఆర్ భారత రాజ్యాంగాన్ని మార్చమంటున్నారు. కానీ జగన్ ఇప్పటికే రాజ్యాంగాన్ని మార్చేశారని ఎద్దేవా చేశారు. ఏపీలో ఇప్పుడు భారత రాజ్యాంగం బదులు భారతి రాజ్యాంగం అమలవుతోంది మండిపడ్డారు.

అమరావతి రైతుల పోరాటం ఫలిస్తుంది
అమరావతి ఉద్యమం 800 రోజుకు చేరిన సందర్భంగా రాజధాని రైతులకు ఆదినారాయ రెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌పై విరుచుకుపడ్డారు. అమరావతి రైతుల, మహిళల పోరాటం కచ్చితంగా ఫలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే రాజధాని విశాఖకు మారుస్తారని గతంలోనే తాను మంత్రి వర్గంలో ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. అదే ఇప్పుడు నిజమైందని విమర్శలు గుప్పించారు.

విశాఖలో జగన్‌కు వేల ఎకరాల భూములు
విశాఖపట్నంలో జగన్ కు వేల ఎకరాలు భూములు ఉన్నాయన్నాయని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖపట్నంలో భూములు కొన్నారని పేర్కొన్నారు. నాడు విశాఖలో జగన్ కొన్న ఆ భూములకు ధరల రావాలంటే రాజధాని అక్కడే పెట్టాలని ఆయన ఉద్దేశమని ఆధినారాయణ రెడ్డి ఆరోపించారు. అందుకే రాజధానిగా ప్రకటించారని ద్వజమెత్తారు. దోచుకునే వ్యక్తి సీఎం అయితే రాష్ట్రానికి మంచి ఎలా జరుగుతుందన్నారు.
Recommended Video

పరిటాల రవిని చంపినట్లు నన్ను కూడా చంపుతారేమో..?
సొంత బాబాయి వివేకానంద రెడ్డిని చంపి ఆ కుట్రను పక్కవాళ్లపై మోపే దుర్మార్గులని ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. వారి సొంత టీవీలో తొలుత గుండెపోటు అని ప్రచారం చేశారు. తర్వాత దానిని గుండెల్లో పోటుగా మార్చారని విమర్శించారు. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో తొలుత చంద్రబాబుపైన , నాపైన నిందలు మోపారని ఆదినారాయణ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆకేసులో వాస్తవాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. కేసును నిరుకార్చేందుకు సీబీఐపైనే వైసీపీ నేతలు నిందలు మోపుతున్నారని దుయ్యబట్టారు. పరిటాల రవీంద్రను చంపినట్లు నన్ను కూడా చంపుతారని మా కుటుంబం భయపడుతోందని పేర్కొన్నారు. భయపడుతూ ఎన్నాళ్లు ఉంటా... ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు ఆదినారాయణ రెడ్డి తెలిపారు.
-
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications