హైకమాండ్ నిర్ణయం శిరోధార్యం

Daggubati Purandeswari: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐఏడీఎంకే ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి. కొత్తగా ఆవిర్భవించిన టీవీకే సైతం పూర్తిస్థాయిలో ఈ ఎన్నికల బరిలో దిగబోతోండటం వల్ల త్రిముఖ పోటీ ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది.

ఈక్వేషన్లు మళ్లీ మారాయి..

ఈ పరిస్థితుల్లో తమిళ రాజకీయాల్లో ఈక్వేషన్లు మళ్లీ మారాయి. ఇటీవలే ఢిల్లీలో అమిత్ షా- మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి మధ్య జరిగిన చర్యలు ఫలించాయి. ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీ. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

BJP AIADMK alliance We have a common enemy and agenda says APBJP chief Purandeswari

రాష్ట్రస్థాయిలో చర్చలు సైతం..

ఈపీఎస్ ఢిల్లీ పర్యటనకు ముందు.. అన్నాడీఎంకే- బీజేపీ మధ్య రాష్ట్రస్థాయిలో చర్చలు సైతం జరిగాయి. బీజేపీ సానుకూల సంకేతాలను కూడా పంపించింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి వ్యక్తిగతంగా ఈపీఎస్‌కు ఇష్టం లేకపోయినప్పటికీ- రాజకీయ మనుగడ కోసం తప్పనిసరి పరిస్థితులు, బీజేపీ హైకమాండ్ నుండి వస్తోన్న ఒత్తిళ్ల కారణంగా పళనిస్వామి తన మనసు మార్చుకున్నట్లు చెబుతున్నారు.

బీజేపీ ప్రభావం..

2016లో జయలలిత కన్నుమూయడం, పార్టీలో చీలిక ఏర్పడిన పరిస్థితుల్లో ఏఐఏడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ సమయంలో అన్నాడీఎంకే ప్రభుత్వం తీసుకున్న అనేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై బీజేపీ ప్రభావం ఉందనే విమర్శలు సైతం వ్యక్తం అయ్యాయి.

నిలువనీడ లేకుండా

తమిళనాడులో 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించిన అనంతరం ఈక్వేషన్లు మారిపోయాయి. బీజేపీకి దూరం అయ్యారు ఈపీఎస్. 2023 సెప్టెంబర్‌లో పొత్తు తెంచుకున్నారు. 2024 నాటి లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ డీఎంకే తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఏఐఏడీఎంకేను నిలువనీడ లేకుండా చేసినట్టయింది.

దక్షిణాదిలో బీజేపీ వ్యతిరేక కూటమి..

అదే సమయంలో డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి స్టాలిన్ దక్షిణాదిలో బీజేపీ వ్యతిరేక కూటమికి నాయకుడిగా ఎదుగుతోండటంతో పళనిస్వామి పునరాలోచనలో పడ్డారు. స్టాలిన్, ఆయన తనయుడు, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ దూకుడుకు బ్రేకులు వేయాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికొచ్చారు. పొత్తులకు సై అన్నారు.

పొత్తును స్వాగతించిన పురంధేశ్వరి..

ఈ పరిణామాలపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడారు. పొత్తును స్వాగతించారు. ఈ విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలే శిరోధార్యమని వ్యాఖ్యానించారు. పార్టీ శ్రేయస్సు, రాష్ట్ర ప్రయోజనాల కోసమే పొత్తు నిర్ణయాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.

సహజ భాగస్వామ్యం..

బీజేపీ-ఏఐఏడీఎంకే సహజ భాగస్వామ్యపక్షాలని పేర్కొన్నారు పురంధేశ్వరి. దురదృష్టవశాత్తు 2021 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేయలేకపోయామని అన్నారు. ఇప్పుడు అమిత్ షా ఈ విషయంలో చాలా శ్రద్ధ చూపారని, ప్రత్యేకంగా దృష్టి సారించారని చెప్పారు. తమిళనాడులో ఉమ్మడి శతృవును ఎదుర్కొనడానికి ఉమ్మడి అజెండాతో పోరాడాల్సి ఉందని పేర్కొన్నారు.

విచ్చలవిడిగా అవినీతి..

డీఎంకే ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, దీనికి వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని పురందేశ్వరి చెప్పారు. డీఎంకేను ఓ విభజన పార్టీగా అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకేకు ఓటమ తప్పదని, అక్కడ బీజేపీ- ఏఐఏడీఎంకే సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందంటూ ధీమా వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+