మాధవ్ కు పగ్గాల వెనుక కీలక నేత - పురందేశ్వరి వాట్ నెక్స్ట్..!!
ఏపీ బీజేపీ అధ్యక్షుడిని పార్టీ నాయకత్వం ఖరారు చేసింది. ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరి స్థానంలో మాధవ్ ను కొత్త అధ్యక్షుడిగా ఎంపిక చేసారు. మాధవ్ ఎంపిక వెనుక భారీ కసరత్తు జరిగి నట్లు తెలుస్తోంది. రేసులో పలువురు నేతలు ఉండటంతో హైకమాండ్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుంది. మాధవ్ కోసం ఏపీకి చెందిన కీలక నేత క్రియాశీలకంగా వ్యవహరించారు. ఇక, ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన పురందేశ్వరికి ఏ పదవి దక్కనుందనేది రాజకీయంగా కీలకంగా మారుతోంది.
కొత్త అధ్యక్షుడిగా..
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి కోసం పలువురు ముఖ్య నేతలు పోటీ పడ్డారు. అయితే, మోదీ - షా ద్వయం ఏపీలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వంలో ఉండటం .. భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా అధ్యక్షుడి పైన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు పది మంది వరకు ఆశావాహులు పార్టీ అధ్యక్షుడి పదవి కోసం పోటీ లో ఉన్నారు. వారిలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థ సారథి, విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే, బీజేపీ నాయకత్వం మాత్రం భవిష్యత్ వ్యూహాలకు అనుగుణంగా మాధవ్ ను ఎంపిక చేసింది.

మాధవ్ కోసం
బీసీ వర్గం నుంచి ఇద్దరు నేతలు ప్రధానంగా పోటీలో నిలిచారు. కాగా, తొలి నుంచి పార్టీకి విధేయత తో పాటుగా మిత్రపక్షాలతో సమన్వయం చేసుకునే నేతకు పగ్గాలు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. అందులో ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతకు బాధ్యతలు అప్పగించటం ద్వారా రానున్న రోజుల్లో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. అందులో భాగంగా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు బాధ్యతలు అప్పగించారు. కాగా, మాధవ్ కోసం ఢిల్లీ - ఏపీ మధ్య కీలకంగా వ్యవహరిస్తున్న నేత కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అటు టీడీపీ .. ఇటు బీజేపీలోని ముఖ్యులతో సత్సంబంధాలు ఉన్న ఆ నేత ఈ ఎంపికలో ఢిల్లీ పెద్దలను ఒప్పించారని పార్టీ లో ప్రచారం సాగుతోంది.
పురందేశ్వరికి వాట్ నెక్స్ట్
ఏపీ అధ్యక్ష బాధ్యతలు మాధవ్ కు ఖరారు కావటంతో.. ఇప్పుడు పురందేశ్వరి కి ఎలాంటి బాధ్యత లు అప్పగిస్తారనే చర్చ మొదలైంది. ఎన్నికల సమయంలోనే కొందరు నేతలు పురందేశ్వరి పైన ఢిల్లీకి ఫిర్యాదులు చేసినట్లు ప్రచారం సాగింది. ఇక.. ఇప్పుడు పురందేశ్వరికి పార్టీలో జాతీయ స్థాయి లో బాధ్యతలు ఇస్తారని చెబుతున్నారు. అదే సమయంలో లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ పదవి విషయంలోనూ పురందేశ్వరి పేరు పరిశీలనలో ఉందనేది ఢిల్లీ సర్కిల్స్ లో ఉన్న ప్రచారం. అయితే.. బీజేపీ అధి నాయకత్వం నిర్ణయం ఏంటనేది సస్పెన్స్ గానే ఉంది. పొత్తుల వేళ ఏపీ కేంద్రంగా బీజేపీ నాయకత్వం రానున్న రోజుల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఇప్పుడు పురందేశ్వరి దక్కే పదవి ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications