వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రబాబుకు షాక్: రాజ్యసభకు రాజస్థాన్ నుంచి వెంకయ్య, కర్ణాటక నుంచి నిర్మల

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తమ 12మంది తమ రాజ్యసభ అభ్యర్థులను ఖరారు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్రమంత్రులుగా కొనసాగుతున్న వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్‌ల రాజ్యసభ అభ్యర్థిత్వంపై కూడా తేల్చేసింది. రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో మరోసారి వీరికి అవకాశం కల్పించింది.

రాజస్థాన్ రాష్ట్రం నుంచి వెంకయ్యనాయుడును, కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌ను బిజెపి రాజ్యసభకు పంపనుంది. ఏపీ నుంచే వీరిలో ఒకరినైనా రాజ్యసభకు పంపుతారని వార్తలు వచ్చినప్పటికీ బిజెపి అనూహ్య నిర్ణయం తీసుకుంది.

తెలుగుదేశం పార్ట అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సంప్రదించకూడదనే ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ఈ కొత్త వ్యూహాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. 1992 నుంచి బిజెపి తరఫున 3 సార్లు రాజ్యసభకు ఎన్నికైన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు ఈసారి రాజస్థాన్‌ నుంచి అవకాశం కల్పించడం గమనార్హం.

venkaiah-nirmala

రాజస్థాన్ రాష్ట్రం నుంచే బిజెపి ఉపాధ్యక్షుడు ఓం ప్రకాశ్ మాథూర్, హర్ష వర్ధన్ సింగ్, రాంకుమార్ వర్మలకు అవకాశం కల్పించింది. హర్యానా నుంచి బీరేంద్ర సింగ్‌కు, జార్ఖండ్ నుంచి ముక్తార్ అబ్బాస్ నఖ్వీల అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.

మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్, బీహార్ నుంచి గోపాల్ నారాయణ్ సింగ్, గుజరాత్ నుంచి పురుషోత్తమ రూపాల, మధ్యప్రదేశ్ నుంచి అనిల్ మాధవ్ దవే, ఛత్తీస్‌గఢ్ నుంచి రామ్ విచార్‌ నేతంలను రాజ్యసభకు పంపాలని బిజెపి నిర్ణయించింది.

హైదరాబాద్‌లో అమిత్ షా

తెలంగాణలో బలమైన శక్తిగా ఎదుగుతామని భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. టిఆర్ఎస్ పార్టీ పొత్తుపై ఎలాంటి ప్రతిపాదన రాలేదని అన్నారు. తెలంగాణలో మోడీ పర్యటన ఉంటుందని చెప్పారు.
ఏపీకి హోదాపై పార్లమెంటు నిర్ణయం తీసుకుందని, ఆ ప్రకారమే ముందుకు వెళ్తామని అన్నారు.

కాగా, అమిత్ షా ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆయనకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్‌ సహా పలువురు భాజపా నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం 5.30 గంటలకు శంషాబాద్‌లో పార్టీ ప్రతినిధుల సభలో అమిత్‌ షా పాల్గొననున్నారు.

English summary
The Bharatiya Janata Party on Sunday announced its list of nominees for the Rajya Sabha. Union Ministers Venkaiah Naidu and Nirmala Sitharaman have been nominated from Rajasthan and Karnataka, respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X