విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబు ఎఫెక్ట్: పురంధేశ్వరి సీటుపై బిజెపి డైలమా

By Pratap
|
Google Oneindia TeluguNews

BJP in dilemma on Purandheswari
విశాఖపట్నం‌: తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా బిజెపిలో చేరిన మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి చిక్కుల్లో పడినట్లు అర్థమవుతోంది. దగ్గుబాటి పురంధేశ్వరిని పోటీకి దించవద్దని టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బిజెపి నాయకత్వానికి సూచిస్తున్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేత ఎం. వెంకయ్య నాయుడి మాటలు నమ్మి బిజెపిలో చేరిన పురంధేశ్వరికి విశాఖపట్నం లోకసభ సీటు దక్కడం అనుమానంగానే ఉందని అంటున్నారు.

వెంకయ్యనాయుడితో మంతనాలు జరిగిన తర్వాతనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధేశ్వరి ఇద్దరూ కాంగ్రెస్‌కు రాజినామా చేశారు. వెంకటేశ్వర రావు రాజకీయ సన్యాసం చేయగా, పురంధేశ్వరి మాత్రం బిజెపిలో చేరారు. పార్టీలో చేరేటపుడు పురంధేశ్వరిని తిరిగి విశాఖపట్నం లోక్‌సభ స్ధానం నుంచే పోటీ చేసేలా చూస్తానని వెంకయ్య హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతు న్నాయి.

పొత్తు తదితర పరిణామాలలో సీమాంధ్ర ప్రాంతంలో బిజెపికి తెలుగుదేశం పార్టీ ఐదు లోక్‌సభ స్దానాలను మాత్రమే కేటాయించింది. వాటిలో తిరుపతి, అరకు స్దానాలు ఎస్టీ, ఎస్సీలకు రిజర్వ్ అయినవి. మిగిలిన సీట్లలో నర్సాపురం నుంచి రఘురామ కృష్ణంరాజు పోటీ చేయనున్నారు. విశాఖపట్నం సీటు నుంచి సీమాంధ్ర బిజెపి అధ్యక్షుడు హరిబాబు పోటీ చేయాలని అనుకుంటున్నారు.

ఇక మిగిలిన ఒక్క సీటు కడప జిల్లాలోని రాజంపేట. అయితే, రాజంపేట సీటు నుంచి పురంధేశ్వరి పోటీ చేయడం సాధ్యం కాదు. హరిబాబును తప్పించి పురంధేశ్వరికి బిజెపి నాయకత్వం విశాఖపట్నం సీటు కేటాయిస్తుందా అనేది అనుమానంగానే ఉంది. పురంధేశ్వరి కోసం అరకును టిడిపికి అప్పగించి, ఒంగోలు సీటు అడగాలనే ఉద్దేశంతో బిజెపి ఉన్నట్లు తెలుస్తోంది. చివరికి, రాజ్యసభకు పంపుతామని చెప్పి పురంధేశ్వరిని పోటీ నుంచి తప్పిస్తారా అనేది కూడా అనుమానంగానే ఉంది.

English summary

 Former union minister Daggubati Purandheswari is facing trouble regarding Visakhapatnam Lok Sabha seat with the alliance with Telugudeasam and with contender Haribabu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X