నిధుల్లో ఆ పార్టీయే టాప్ - ఎవరి ఖాతాలో ఎంత..!!

రాజకీయ పార్టీలకు విరాళాలు భారీగా లభిస్తున్నాయి. 2023-24 లో పార్టీలకు అందిన విరాళాల లెక్కలను ఎన్నికల సంఘం వెల్లడించింది. అత్యధికంగా బీజేపీకి రూ 2,244 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. మూడో సారి అధికారంలోకి వచ్చే వేళ ఈ పార్టీకి భారీగా విరాళాలు అందాయి. అదే విధం గా తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ, వైసీపీ, బీఆర్ఎస్ కు వచ్చిన విరాళాల లెక్కలను వెల్లడించారు. ఇక, కాంగ్రెస్ కు అందిన విరాళాలు బీజేపీతో పోల్చితే చాలా తక్కువగా ఉంది.

విరాళాల లెక్కలు
ఎన్నికల సంఘం వెల్లడించిన పార్టీల విరాళాల లెక్కలు ఆసక్తి కరంగా మారాయి. గత ఆర్థిక సంవత్సరంలో బిజెపికి రూ.2,244 కోట్ల విరాళాలు లభించాయి. 2022-23లో ఆ పార్టీకి వచ్చిన విరాళాలతో పోలిస్తే ఇది మూడు రెట్లు అదనం. బిజెపికి ప్రుడెంట్‌ ఎలక్టొరల్‌ ట్రస్ట్‌ అందరి కంటే అధిక మొత్తంలో విరాళం అందింది. ఇక, కాంగ్రెస్‌కు రూ.288.9 కోట్ల విరాళాలు అందినట్లు తాజా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 2022-23లో కాంగ్రెస్‌కు వచ్చిన విరాళాల మొత్తం రూ.79.9 కోట్లు మాత్రమే. బిజెపికి రూ.20,000, ఆ పైన విరాళం ఇచ్చేందుకు వ్యక్తులు, ట్రస్ట్‌లు, కార్పొరేట్‌ సంస్థలు పోటీ పడ్డారు.

BJP s donations surged to Rs 2244 crore in 2023-24 triple the previous year

వైసీపీ - బీఆర్ఎస్ కు డొనేషన్లు
పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన ప్రుడెంట్‌ ఎలక్టొరల్‌ ట్రస్ట్‌ నుంచి బిజెపికి, రూ.723.6 కోట్లు, కాంగ్రెస్‌ కు రూ.156.4 కోట్ల విరాళాలు అందాయి. 2022-23లో ప్రుడెంట్‌ ట్రస్ట్‌కు అధిక మొత్తంలో విరాళాలు అందించిన వారిలో మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌, సెరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ఆర్సెలర్‌ మిట్టల్‌ గ్రూప్‌, భారతి ఎయిర్‌టెల్‌ పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చిన జాబితాల ఉన్నాయి. కాగా, తమకు ఎన్నికల బాండ్ల ద్వారా లభించిన విరాళాల సమాచారాన్ని కొన్ని ప్రాంతీయ పార్టీలు 2023-24లో స్వచ్ఛందంగా ప్రకటించాయి. వీటిలో బీఆర్‌ఎస్‌, డీఎంకే, వైసీపీ, జేఎంఎం పార్టీలు ఉన్నాయి.

టీడీపీ లెక్క ఎంత
గత ఆర్థిక సంవత్సరంలో ప్రుడెంట్‌ ట్రస్ట్‌ తెలుగు రాష్ట్రాల్లో అప్పుడు అధికారంలో ఉన్న రెండు పార్టీలు బీఆర్‌ఎస్‌, వైసీపీకి కూడా విరాళాలు ఇచ్చింది. కాగా, ఏపీలో ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీకి ప్రుడెంట్‌ ట్రస్ట్‌ నుండి రూ.33 కోట్ల విరాళం అందింది. అయితే, గత ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా లెక్క చూస్తే టీడీపీకి రూ.100 కోట్లకు పైగా విరాళాలు అందాయి. ఇక.. సీపీఐ (ఎం)కు 2022-23లో రూ.6.1 కోట్ల విరాళం అందగా గత ఏడాది రూ.7.6 కోట్లు వచ్చాయి. ఆప్‌, బీఎస్పీ, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, బీజేడీ, టీడీపీ, సమాజ్‌వాదీ పార్టీలు కూడా తమకు అందిన విరాళాల వివరాలను వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+