ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై - మోదీ నిర్ణయం వెనుక..!!

ఊహించిందే జరిగింది. ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ను రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు - కేంద్రం హోం మంత్రి అమిత్ షా తో సమావేశం అయ్యారు. ఆ సమయంలో ఏపీ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానం తమ పార్టీ అభ్యర్దిగా అన్నామలైను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఇక, ఏపీ నుంచి అన్నామలై ఎంట్రీ వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. ఇక, అన్నామలై కేంద్ర మంత్రి అవ్వటం దాదాపు ఖాయమైంది.

పెద్దల సభకు అన్నామలై
ఏపీ కేంద్రంగా బీజేపీ అసలైన రాజకీయం మొదలు పెట్టింది. కూటమిలో ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన బీజేపీ కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నుంచి రాజ్యసభ స్థానాల విషయంలో బీజేపీ తొలి నుంచి గట్టిగానే వ్యవహ రిస్తోంది. ఇప్పటికే ఆర్ క్రిష్ణయ్య ను తమ పార్టీ నుంచి ఎంపిక చేసిన బీజేపీ.. ఇప్పుడు సాయిరెడ్డి స్థానం తమకే కావాలని తేల్చేసింది. సాయిరెడ్డి స్థానంలో బీజేపీ ఫైర్ బ్రాండ్ అన్నామలై పేరు ను బీజేపీ ఖరారు చేసింది. ఇప్పటికే ఈ ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది.

bjp-finalised-annamali-for-rajyasabha-from-ap

నిర్ణయం వెనుక
ఈ సమయంలో అనూహ్యంగా బీజేపీ తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. వచ్చే ఏడాది తమిళనాడు లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి ఎన్నికలను బీజేపీ నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. అక్కడ అన్నా డీఏంకేతో పొత్తు ఖాయం చేసుకుంది. ఈ పొత్తు వేళ పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యత నుంచి అన్నామలైను తప్పించారు. పొత్తు ప్రకటన వేళ పార్టీ ముఖ్యనేత అమిత్ షా తాము జాతీయ స్థాయిలో అన్నామలై సేవలు వినియోగించుకుంటామని ప్రకటించారు. కాగా, ముందుగా అన్నామలైను రాజ్యసభ కు ఎంపిక చేయాలని బీజేపీ నాయకత్వం డిసైడ్ అయినట్లు సమాచారం. అందులో భాగంగా తమిళనాడు పొరుగు రాష్ట్రంగా ఉన్న ఏపీ నుంచి సాయిరెడ్డి స్థానంలో అన్నామలైను రాజ్యసభకు పంపాలని పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నారు.

కేంద్ర మంత్రిగా
గతంలో ఏపీ నుంచి బీజేపీ రాజ్యసభ సభ్యులుగా వ్యవహరించి సురేశ్ ప్రభు సైతం కేంద్ర మంత్రి గా వ్యవహరించారు. ఎన్నికల సమయంలో అన్నామలైకు మద్దతుగా లోకేష్ సైతం ఎన్నికల ప్రచారం చేసారు. బీజేపీ సూచన మేరకు ఇప్పటికే ఈ సీటు ను వారికే వదిలేయాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు. అన్నామలైకు ఇవ్వటం ద్వారా ఏపీ - తెలంగాణలోనూ రానున్న రోజుల్లో పార్టీకి మేలు చేస్తుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే పవన్ సనాతన ధర్మం పేరుతో ఏపీలో కొత్త సమీకరణాలకు తెర తీసారు. ఇప్పుడు అన్నామలై సైతం ఏపీ నుంచే ఎంపీగా ఉంటే బీజేపీ భవిష్యత్ వ్యూహాలు పక్కాగా అమలు చేయవచ్చని చెబుతున్నారు. దీంతో, అన్నామలై కు ఏపీ నుంచి రాజ్యసభకు పంపటం ద్వారా కొత్త రాజకీయం మొదలు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+