వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఫైర్ బ్రాండ్ జీవీఎల్ సైలెంట్ ....వ్యూహాత్మకమా ? పార్టీ ఆదేశామా ?

|
Google Oneindia TeluguNews

బిజెపి ఫైర్ బ్రాండ్ , రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల పైన మాటల తూటాలు పేల్చే జీవీఎల్ సైలెంట్ వెనుక కారణం వ్యూహాత్మకమా? లేక జాతీయ పార్టీ ఆదేశమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు తెలుగు మీడియం తీసివేత పైన, ఇసుక కొరత పైనా, రాజధాని అంశం పైన వాడి వేడి చర్చ జరుగుతున్న సమయంలో, తనకేమీ పట్టనట్టు గా జీవీఎల్ నరసింహారావు వ్యవహరించడానికి గల కారణమేంటి? అన్న అంశాలు హాట్ టాపిక్ గా మారాయి.

తెలంగాణ వద్దు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దు..ఊహించని కొత్త డిమాండ్!తెలంగాణ వద్దు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దు..ఊహించని కొత్త డిమాండ్!

బీజేపీ ఫైర్ బ్రాండ్ జీవీఎల్ సైలెంట్

బీజేపీ ఫైర్ బ్రాండ్ జీవీఎల్ సైలెంట్

జీవీఎల్ నరసింహారావు... పరిచయం అక్కర్లేని నేత. భారతీయ జనతా పార్టీలో ఉన్న ఫైర్ బ్రాండ్. మొదటి నుండి ప్రత్యర్ధి పార్టీల పైన పదునైన రాజకీయ వ్యాఖ్యలు చేసి బిజెపి తరపున ఒక బలమైన వాయిస్ వినిపించిన నేతగా జీవీఎల్ నరసింహారావు కు పేరుంది. జీవీఎల్ నరసింహారావు ఎన్నోసార్లు బిజెపి అధికార ప్రతినిధిగా తన వ్యూహాత్మక ప్రశ్నలతో, సమాధానాలతో ప్రతిపక్షాలను గట్టిగా ఎదుర్కొన్నాడు. బిజెపి వాయిస్ ను బలంగా వినిపించారు. ప్రెస్ మీట్ లలో,డిబేట్ లలో హడావిడి చేసిన జివిఎల్ నరసింహారావు ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు.

 బీజేపీలో పలు మార్పులు జరగనున్న నేపధ్యంలోనే వ్యూహాత్మక మౌనం ?

బీజేపీలో పలు మార్పులు జరగనున్న నేపధ్యంలోనే వ్యూహాత్మక మౌనం ?

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నో బర్నింగ్ వ్యవహారాలు నడుస్తున్నా ఆయన మాత్రం నోరు విప్పడం లేదు. అందుకు కారణం ఇంకా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై, భారతీయ జనతా పార్టీ కచ్చితమైన స్టాండ్ తీసుకోకపోవడమే అన్నది ప్రధానంగా చర్చనీయాంశంగా మారింది. ఏపీలో భవిష్యత్తు రాజకీయాలలలో బిజెపిలో పలుమార్పులు జరగనున్నాయని తెలుస్తుంది. ఇక మార్పులు జరిగిన తర్వాత ప్రభుత్వ విధానం పైన పోరాటం సాగించడానికి భారతీయ జనతా పార్టీ కచ్చితమైన వ్యూహాన్ని నిర్ధారించుకున్న తర్వాత జీవీఎల్ నరసింహారావు మీడియా ముందుకు రావాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

రాజధాని అమరావతిపై పెద్ద రచ్చ జరుగుతున్నా స్పందించని జీవీఎల్

రాజధాని అమరావతిపై పెద్ద రచ్చ జరుగుతున్నా స్పందించని జీవీఎల్

ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసేవారు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పడంలో జీవీఎల్ స్టైలే వేరు. అలాంటి జీవీఎల్ రాజధాని అమరావతి విషయంలో పెద్ద రగడ జరుగుతున్న రాజధాని అమరావతి సమస్యపై అస్సలు వ్యాఖ్యానించడం లేదు. ఇక జి వి ఎల్ సైలెంట్ కావడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఏపీలో బీజేపీ లో చాలా మార్పులు జరగబోతున్నాయి అని తెలుస్తోంది.

 రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అన్ని సమస్యలపై బీజేపీ స్టాండ్ పై ఇంకా రాని క్లారిటీ

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న అన్ని సమస్యలపై బీజేపీ స్టాండ్ పై ఇంకా రాని క్లారిటీ

ఆయన మీడియా ముందుకు వస్తే అన్ని విషయాల పైన బిజెపి స్టాండ్ చెప్పాల్సి వస్తుంది. అయితే ఇప్పటికే పలు వ్యవహారాల పైన బీజేపీ స్టాండ్ తీసుకునే విషయంలో ఒక క్లారిటీ రానందున జీవీఎల్ నరసింహారావు కొంతకాలం పాటు మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు గా ప్రచారం అవుతుంది. మరోవైపు ఏపీలో బీజేపీ, జనసేన కలిసి సాగే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఇక అదే విధంగా రాజకీయంగా కూడా టిడిపి, జనసేన విషయంలో కూడా క్లియర్ పిక్చర్ రావాల్సి ఉంది.

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే యాక్టివ్ కానున్న జీవీఎల్

హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే యాక్టివ్ కానున్న జీవీఎల్

అందుకే జీవీఎల్ ప్రస్తుతానికి వేచి చూస్తున్నారు. జాతీయ పార్టీ ఏపీ రాజకీయాలపై ఓ కచ్చితమైన స్టాండ్ కి వచ్చిన తర్వాత మళ్లీ జీవీఎల్ యాక్టివ్ అవుతారని అందరూ భావిస్తున్నారు. మొత్తానికి జీవీఎల్ మౌనం వ్యూహాత్మకమే అని ఏపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.

English summary
BJP Rajya Sabha member GVL Narasimha Rao is a fire-brand, it is well known. He is known for making sharp political comments at the opponents since the beginning. On the number of times, BJP official Spokesperson has strongly countered the opposition with his tactful answers and he proved his political worth. Not BJP MP has become silent all of a sudden and he is not at all commenting on AP politics and on the Amaravathi capital issue. Whether it is a part of political tactics .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X