టీడీపీ -జనసేన పొత్తు : ఏపీ బీజేపీకీ హైకమాండ్ కొత్త రోడ్ మ్యాప్..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు లాంఛనమే. ఇదే సమయంలో బీజేపీ ఏపీలో పరిణామాలపైన ఫోకస్ పెట్టింది. తాజాగా జరిగిన బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాల్లో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంపై చర్చ జరిగింది. ఏపీలో పరిణామాలపై సోము వీర్రాజు పార్టీ ముఖ్య నేతలకు వివరించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి దక్షిణాదిన విస్తరించటం లక్ష్యంగా డిసైడ్ అయ్యారు. ఏపీలో పొత్తుల అంశం పైనా రాష్ట్ర నేతలకు స్పష్టత ఇచ్చారు. కొత్త రోడ్ మ్యాప్ నిర్దేశించారు. ఈ నెల 24న ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో కొత్త కార్యాచరణ ప్రకటించనున్నారు.

టీడీపీ - జనసేన పొత్తు ఎఫెక్ట్ పై ఆరా..
ఏపీలో రాజకీయాలపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. పవన్ కల్యాణ్ తమకు మిత్రపక్షంగా ఉంటూ..టీడీపీతో దగ్గరవుతున్న అంశం పైన ఏపీ నేతలు పార్టీ పెద్దలకు వివరించారు. విశాఖ పర్యటన సమయంలో ప్రధాని ప్రత్యేకంగా పవన్ తో సమావేశమయ్యారు. ఆ తరువాత రెండు పార్టల మధ్య గ్యాప్ తగ్గి..సఖ్యత పెరుగుతుందని భావించారు. కానీ, గతం కంటే జనసేన - బీజేపీ మధ్య దూరం పెరిగింది. ఇదే సమయంలో చంద్రాబు - పవన్ మధ్య దూరం తగ్గింది. ఇప్పుడు పొత్తుగా మారుతోంది. బీజేపీ కూడా తమతో కలిసి రావాలని పవన్ - చంద్రబాబు కోరుకుంటున్నారు. ఇదే అంశం పైన ఢిల్లీ వేదికగా నేతల మధ్య చర్చలు జరిగాయి. దీని పైన బీజేపీ ముఖ్య నేతలు క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ఎలా ముందుకు వెళ్లాలనే దాని పైనా స్పష్టత ఇచ్చారు.

పొత్తులపై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్..
తెలుగు రాష్ట్రాల్లో పొత్తులు ఎవరితో ఉండవని బీజేపీ అధినాయకత్వం తెలుగు రాష్ట్రాల బీజేపీ ముఖ్యులకు తేల్చి చెప్పింది. తెలంగాణలో టీడీపీ తో బీజేపీ పొత్తు ఉంటుందనే అంశం పైన ఆ రాష్ట్ర నేతలు పార్టీ ముఖ్యుల వద్ద ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే సమయంలో పవన కల్యాణ్ తమను కాదని టీడీపీతో కలిసి జనసేన వెళ్లాలని నిర్ణయించుకుంటే, పట్టించుకోవద్దని ఒక నిర్ణయానికి వచ్చినట్టు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. ఏపీలో వ్యవహరించాల్సిన తీరు పైన పార్టీ నేతలకు ఈ నెల 24న భీమవరంలో జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర ఇంఛార్జ్ అధికారికంగా వెల్లడించనున్నారు.












Click it and Unblock the Notifications