పురందేశ్వరికి కీలక పదవి - మారుతున్న బీజేపీ లెక్కలు..!!
ఏపీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. బీజేపీ ఏపీలో పక్కా వ్యూహాత్మకంగా నిర్ణయా లు తీసుకుంటోంది. మిషన్ 2029 లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలో భాగస్వామిగా బీజేపీ ఉంటూనే సొంతంగా బలం పెంచుకోవటం పైన ఫోకస్ చేసింది. ఇప్పటికే ఏపీ కేంద్రంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజా నియామకాల్లోనూ సామాజిక లెక్కలకు ప్రాధాన్యత ఇచ్చింది. కాగా, ఇప్పుడు బీజేపీ మాజీ చీఫ్ పురందేశ్వరికి కీలక పదవి కట్టబెట్టేందుకు రంగం సిద్దమైంది.
బీజేపీ మార్క్ నిర్ణయాలు
ప్రధాని మోదీ దక్షిణాది రాష్ట్రాల పైన పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మిషన్ - 2029 లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ సారి మెజార్టీ సీట్లు సాధించాలని లక్ష్యంగా డిసైడ్ అయినట్లు స్ఫష్టం అవుతోంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆరెస్సెస్ నేపథ్యం.. బీజేపీ లో సుదీర్ఘ కాలం పని చేసిన వారికే అవకాశం కల్పించారు. ఏపీ నుంచి నియమితులైన ఇద్దరు రాజ్య సభ సభ్యలనూ బీసీలనే ఎంపిక చేసారు. మిత్రపక్షం టీడీపీకి గవర్నర్ పదవి కేటాయించారు. ఇక, కేంద్ర స్థాయిలో నామినేటెడ్ పదవుల విషయంలోనూ మిత్రపక్షాలకు ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇక, ఏపీ బీజేపీ అధ్యక్షురాలి వ్యవహరించిన పురందేశ్వరికి ప్రమోషన్ దక్కనున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం.

పురందేశ్వరికి పదవి
రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో సామాజిక సమీకరణాల్లో భాగంగా మాధవ్ కు పార్టీ బాధ్యతలను అప్పగించారు. పురందేశ్వరికి రెండు పదవుల విషయంలో పరిశీలన చేస్తున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వటం పైన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, అగ్రనాయకత్వం లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీకి మహిళా అధ్యక్షురాలి నియామకం పైన చర్చలు జరుగుతోంది. అందులో పార్టీలో తొలి నుంచి కొనసాగుతున్న మహిళా నేతకు పట్టం కట్టే అవకాశం కనిపిస్తోంది. కాగా, ఏపీ నుంచి పురందేశ్వరికి లోక్ సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వటం ద్వారా భవిష్యత్ సమీకరణాల్లో భాగంగా బీజేపీ నాయకత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
కీలక నిర్ణయం
పురందేశ్వరికి హిందీ, ఇంగ్లీషు భాషల్లో ప్రావీణ్యం.. పార్లమెంట్ వ్యవహారాల పైన ఉన్న అనుభవం తో డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారని ఢిల్లీ ముఖ్య నేతల్లో తాజాగా చర్చ మొదలైంది. ఏపీలో సొంతం గా ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్న ప్రధాని మోదీ అటు కేంద్రం నుంచి రాష్ట్రానికి తోడ్పాటు అందిస్తూనే.. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిణా మాలను తమకు అనుకూలంగా మల చుకునే వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగా ఏపీ కేంద్రంగా వచ్చే వారం కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం కనిపిస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఈ మేరకు అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications