ఏపీ, తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షులు- అనూహ్య ఎంపిక..!!
బీజేపీ నాయకత్వం తెలుగు రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. కొత్త అధ్యక్షులను దాదాపు ఖరారు చేసింది. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు చెందిన నేతలతో పార్టీ జాతీయ నాయకత్వం చర్చలు పూర్తి చేసింది. కొత్త అధ్యక్షుల పైనా సంకేతాలు ఇచ్చింది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉంది. కాగా, బీజేపీ ఏపీ.. తెలంగాణలో బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా వచ్చే కేంద్ర బడ్జెట్ నుంచి కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
టీ బీజేపీ అధ్యక్షుడిగా
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి నియామకం పైన పార్టీ నాయకత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఈ నెలాఖరులోపు కొత్త జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవలసి ఉంది. దానికి ముందే పలు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపిక జరగాలి. కిషన్ రెడ్డి స్థానంలో కొత్తగా బీసీ వర్గాలకు ఈ పదవి ఇవ్వాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. అనేక చర్చల తరువాత... పార్టీ నాయకత్వం ఈటెల రాజేందర్ పేరు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో మరో ఇద్దరు నేతలు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. చివరి నిమిషంలో నిర్ణయం మారితే మినహా ఈటెల పేరు ఖాయంగా కనిపిస్తోంది.

ఏపీ నుంచి పోటీ
ఇక, ఏపీలో అధ్యక్ష పదవి కోసం పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీలో కూటమి అధికారం లో ఉండటంతో.. మిత్రపక్షాలను కలుపుకొని పోయే నేతకు బాధ్యతలు అప్పగించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి 2023 జూలైలో ఈ బాధ్యతలు చేపట్టారు. దీంతో, కొత్త అధ్యక్ష కోసం పోటీలో ప్రధానంగా మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు వినిపిస్తోంది. అదే విధంగా ఎమ్మెల్యే డాక్టర్ పార్ధసారధి, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, నెల్లూరు కు చెందిన సురేశ్ రెడ్డి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కాగా, విష్ణువర్ధన్ రెడ్డి కోసం కర్ణాటక, తెలంగాణ కు చెందిన ఇద్దరు ముఖ్య నేతలు సిఫార్సు చేసినట్లు సమాచారం. కూటమి లెక్కల్లో సీట్లు దక్కని నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
ఛాన్స్ దక్కేదెవరికి
ఇప్పటికే రాష్ట్ర పార్టీ సహ ఇన్‌చార్జి శివ ప్రకాశ్ పార్టీ ముఖ్యులతో చర్చించారు. కొత్త అధ్యక్షుడి ఖరారు పైన అభిప్రాయాలు పంపాలని కోరారు. టీడీపీ, జనసేనతో పొత్తు ఉండటంతో.. వారితో కలిసి సమన్వయం చేయటం తోపాటుగా ..సామాజిక సమీకరాల ఆధారంగా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలనేది బీజేపీ నాయకత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీంతో, కొత్త వారికి ఇవ్వటం కంటే ప్రస్తుతం మరి కొంత కాలం పురందేశ్వరిని కొనసాగించే ప్రతిపాదన పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో, కొత్త అధ్యక్షుడి నియామకం పైన వచ్చే వారం అధికారికంగా నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications