ఏపీ బీజేపీ ఇంఛార్జ్ గా బండి సంజయ్ - ఆ నేతలకు ఇక బ్రేక్..!?
ఏపీలో బీజేపీ రాజకీయం అంతు చిక్కటం లేదు. జనసేనతో మాత్రమే ఏపీలో పొత్తు ఉంటుందని బీజేపీ స్పష్టం చేస్తోంది. టీడీపీతో పొత్తు ఉంటుందనే ప్రచారం సాగుతోంది. కానీ, స్పష్టత ఇవ్వటం లేదు. ఇదే సమయంలో ఎన్డీఏ సమావేశానికి పవన్ తో పాటుగా పాత మిత్రులను ఆహ్వానించిన బీజేపీ, టీడీపీని పిలవలేదు. ఏపీలో పురందేశ్వరికి నాయకత్వ బాధ్యతలు అప్పగించిన పార్టీ, ఇప్పుడు ఇంఛార్జ్ గా బండి సంజయ్ పేరను వ్యూహాత్మకంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ కొత్త రాజకీయం: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ కొత్త రాజకీయం ప్రారంభించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చింది. తెలంగాణలో పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకున్న పరిణామాలతో బండి సంజయ్ ను తప్పించి ఆ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఏపీలో పురందేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించింది.

దీనికి కొనసాగింపుగా బండి సంజయ్కు ప్రమోషన్ ఇచ్చిన బీజేపీ హైకమాండ్ ఆయనను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. ఆయనకు మరో కీలక బాధ్యత అప్పగించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఇంఛార్జిగా ఉన్న సునీల్ దేవ్‌ధర్‌ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో ఆ స్థానాన్ని బండితో భర్తీ చేయనున్నట్లు పార్టీ ఇంటర్నల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది.

ఏపీకి ఇంఛార్జ్ గా బండి సంజయ్: కేంద్రంలో అవసరమైన సమయంలో బీజేపీ నాయకత్వం వైసీపీ మద్దతు తీసుకుంటోంది. ఏపీలో జనసేనతో కలిసి రాజకీయ ప్రయాణం చేస్తోంది. టీడీపీతో వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. ఇదే సమయంలో కేరళకు చెందిన కేంద్ర మంత్రి మురళీధరన్ 2018 నుంచి ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా ఉంటూనే ఇన్‌ఛార్జ్‌గా చురుగ్గానే వ్యవహరించేవారు.
కానీ, కొంత కాలంగా మూడు నెలలకొకసారి కూడా ఏపీకి రావడంలేదు. కాగా ఏడాదిన్నరగా ఏపీ ఇన్‌ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించమని పార్టీ హైకమాండ్‌ను మురళీధరన్ కోరుతున్నారని సమాచారం. బీజేపీలో గత ఎన్నికల తరువాత చేరిన కొందరి నేతల తీరు..రాష్ట్ర పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఆయన తప్పుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

పొత్తుల రాజకీయంలో కీలకంగా: రాష్ట్రాల్లో ఇన్‌ఛార్జ్‌లను సహ ఇన్‌ఛార్జ్‌లని మార్చడానికి బీజేపీ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. ఏపీ నుంచి తనని తప్పించాలని మురళీధరన్ కోరుతున్నారని మురళీధరన్ కోరుతుండటంతో కొత్త ఇంఛార్జ్ నియమాకం పైన కసరత్తు జరుగుతోంది. అందులో భాగంగా బండి సంజయ్ ను నియమించే అవకాశాలు ఉన్నట్లు బీజేపీ ముఖ్య నేతలు అంచనా వేస్తున్నారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ దూకుడుతో పార్టీకి మైలేజ్ వచ్చింది. ఏపీ బీజేపీలోనూ సంజయ్ కు ఆదరణ ఉంది. ఇదే సమయంలో పొత్తు రాజకీయం.. ఎన్నికల సమయం కావటంతో ఏపీ బాధ్యతలు అప్పగించటం ద్వారా అటు తెలంగాణ.. ఇటు ఏపీలోనూ బండి సంజయ్ నియామకం పార్టీకి మేలు చేస్తుందని లెక్కలు వేస్తున్నారు. దీని పైన ఒకటి రెండు రోజుల్లోనే నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications