బీజేపీ ఆపరేషన్ ఏపీ - కొత్త అధ్యక్షుడు, మెగా స్కెచ్..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కూటమిలోని మూడు పార్టీలు సొంతగా బలం పెంచుకునే వ్యూహాలు అమలు చేస్తున్నాయి. గతం కంటే భిన్నంగా మోదీ ప్రభుత్వం ఏపీ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రంలో సొంతంగా ఎదిగేలా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ పరంగా ప్రక్షాళన మొదలు పెట్టింది. పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన కేంద్ర నాయకత్వం.. పార్టీ ఎదుగుదలకు కొత్త వ్యూహాలు అమలు చేస్తోంది.
ఏపీ పై ఫోకస్
ఏపీలో బీజేపీ సొంతంగా బలం పెంచుకోవటం కోసం కసరత్తు చేస్తోంది. ఇందు కోసం కీలక నిర్ణయా ల దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం లో బీజేపీ భాగస్వామిగా ఉంది. కూటమి లో ఉంటూనే పార్టీ ఎదిగేందుకు ఇదే సరైన సమయంగా బీజేపీ నాయకత్వం భావిస్తోంది. కేంద్రం నుంచి ఏపీకి వరుసగా అందుతున్న సాయం.. నిర్ణయాలు ప్రజల్లో సానుకూలత పెంచుతున్న ఈ సమయంలోనే పార్టీ బలోపేతం దిశగా వ్యూహాలు సిద్దం చేస్తోంది. ఇందు కోసం ఏపీ నేతలతో పార్లమెంట్ సమావేశాల సమయంలో ప్రత్యేకంగా అమిత్ షా భేటీ కానున్నారు. ఆ సమయంలో పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తారని సమాచారం.

బీజేపీ మెగా స్కెచ్
ఏపీలో బీజేపీ బలోపేతానికి ముందుగా సామాజిక సమీకరణాలు.. కలిసి వచ్చే అంశాల పైన పార్టీ నాయకత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ తో బీజేపీ నాయకత్వం సన్నిహిత సంబంధా లు కోరుకుంటోంది. పవన్ తో రాజకీయ మైత్రితో పాటుగా చిరంజీవి కలిసి వస్తే కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. పవన్ సైతం ప్రధాని మోదీ పైన ప్రతీ సందర్భంలో నూ తన అభిమానం చాటుకుంటున్నారు. అదే విధంగా మోదీ సైతం పవన్ సమర్థతను ప్రశంసిస్తు న్నారు. ఈ సమయంలోనే పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం పైన కసరత్తు చేస్తోంది. కాపు లేదా బీసీ వర్గాలకు రాష్ట్ర పార్టీ నాయకత్వం అప్పగించాలని భావిస్తోంది. ఈ మేరకు ముఖ్య నేతల అభిప్రాయాలు సేకరిస్తోంది.
కొత్త అధ్యక్షుడు
ఏపీకి కేంద్రం నుంచి అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ కు అనుకూలంగా ఆర్దిక ప్యాకేజీ లు ప్రకటించారు. దీంతో, బీజేపీ పైన గతం కంటే రాష్ట్ర ప్రజల్లో సానుకూలత పెరిగిందనేది ఆ పార్టీ నేతల అంచనా. ఈ సమయంలోనే జేపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరిని తప్పించి కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మాధవ్, కిరణ్ కుమార్ రెడ్డి, రామచంద్రా రెడ్డి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. రానున్న రోజుల్లోనూ ఏపీకి అనుకూలంగా మరిన్ని సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో, ఫిబ్రవరి తొలి వారంలో ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు చోటు చేసుకునే ఛాన్స్ ఉందనే సమాచారంతో పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది.












Click it and Unblock the Notifications