జగన్ కు సన్నిహితుడే కాదు, 420 బ్యాచ్ కు బ్యాక్ బోన్ ఆయనే !!
గత వైసీపీ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం కక్ష తీర్చుకుంటుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. వైసీపీ నాయకులు మాత్రం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ ప్రభుత్వాన్ని వెనుకనుండి నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి అని బీజేపీ సీనియర్ నాయకుడు భానుప్రకాష్ రెడ్డి విమర్శించారు.
జగన్ ను వెనుక నుండి నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి అని, వైసీపీ నాయకులు చేసిన పాపాలలో సజ్జల రామకృష్ణారెడ్డికి ఎక్కువ భాగం ఉందని బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం వ్యాపారాలు చెక్క పెట్టారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ పార్టీని ముందు నుంచి నపించింది, వెనక నుండి నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి అని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో మొత్తం వ్యవహారం నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి అని భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ 420 టీమ్ ను వెనుక నుండి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నీతులు మాట్లాడటం వినడానికి వింతగా ఉందని భానుప్రకాష్ రెడ్డి వ్యంగంగా అన్నారు. 420 బ్యాచ్ నాయకుడు ఇలా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ నాయకుడు భాను ప్రకాష్ రెడ్డి ఎద్దేవ చేశారు.
జగన్ తర్వాత వైసీపీలో ఎవరు ఉన్నారు అంటే ఆ పార్టీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని ఆంధ్రప్రదేశ్ లో ఉండే చిన్న పిల్లలకు కూడా ఆ విషయం తెలుసని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలో నియంతలా వ్యవహరించారని, తాడేపల్లి ప్యాలస్ నుండి బయటకు కూడా రాలేదని, ఆయన ఎన్నిసార్లు బయటికి వచ్చారో ఆయనకే తెలీదని బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.

సీఎం హోదాలో ఉన్న జగన్ ఎన్నిసార్లు బయటికి వచ్చారు, అధికారం కోల్పోయిన తర్వాత ఎన్ని సార్లు బయటికి వచ్చారు అనే విషయం ప్రజలు గమనిస్తున్నారని, ఈ 420 బ్యాచ్ ను వెనక నుండి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి అసలు బండారం బయటకు వచ్చిన తరువాత నాటకాలు ఆడుతున్నారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై సజ్జల రామకృష్ణారెడ్డి దాడి చేయించారా, లేదా అనే విషయం ఆ పార్టీ నాయకులకు పూర్తిగా తెలుసని భానుప్రకాష్ రెడ్డి అన్నారు.
వైసీపీ నాయకుడు, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ చేసిన వ్యాఖ్యలను ఇంతవరకు ఏ వైసీపీ నాయకుడు ఖండించలేదని భాను ప్రకాష్ రెడ్డి అన్నారు. బోరుగడ్డ అనిల్ ఆరోపణలలో నిజం ఉంది కాబట్టే వైసీపీ నాయకులు నోరు మెదపడంలేదని బానుప్రకాష రెడ్డి ఆరోపించారు. 420 బ్యాచ్ ను వెనక నుండి నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి త్వరలోనే మూల్యం చెల్లించుకుంటారని, గత వైసీపీ ప్రభుత్వంలో చేసిన పాపాలకు ఆయన కూడా బాగం ఉందని బీజేపీ సీనియర్ నాయకు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి ఆరోపించారు.












Click it and Unblock the Notifications