ప్రత్యేక హోదా: 'ఉండవల్లికి మాట్లాడే అర్హత లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత ఉండవల్లి అరుణ్ కుమార్‌కి లేదని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు శుక్రవారం మండిపడ్డారు.
గతంలో రాజమండ్రి ఎంపీగా ఉన్న ఉండవల్లి లోక్‌సభలో ఏపీ గురించి కనీసం 5 నిమిషాలు కూడా ప్రసంగించలేదన్నారు. ఉండవల్లి తన జ్ఞానాన్ని రాష్ట్రాభివృద్ధికి వినియోగించాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ రాష్ట్రాన్ని పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసేందుకు తన వంతు సహకారం అందిస్తుందని తెలిపారు.
గోదావరి ఒడ్డుపై ఆక్రమణల తొలగింపు
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని కోటిలింగాలపేట వద్ద గోదావరి నది ఒడ్డుపై ఆక్రమంగా వేసిన గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించారు. గుడిసెల వాసుల ఆందోళన చేపట్టండతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించారు.












Click it and Unblock the Notifications