భోగాపురం ఏయిర్ పోర్టు పై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు, వందేభారత్ బెటర్..!!
బీజేపీ ముఖ్య నేత చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కరంగా మారాయి. భోగాపురం విమానాశ్రయం పైన ఇప్పటికే రాజకీయంగా చర్చ సాగుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య క్రెడిట్ కోసం డైలాగ్ వార్ కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు.. మాజీ సీఎం జగన్ సైతం ఇదే అంశం పైన కీలక వ్యాఖ్యలు చేసారు. కాగా.. తాజాగా విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణు కుమార్ రాజు భోగాపురం.. విశాఖ విమానాశ్రయాల గురించి ఆసక్తి కర విశ్లేషణ చేసారు. తన అభిప్రాయం ఏంటో తేల్చి చెప్పారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం లాండ్ అయింది. పూర్తి స్థాయిలో ఏయిర్ పోర్టు అందుబాటులోకి వచ్చే డేట్ ను ఫైనల్ చేసారు. ఈ విమానాశ్రయం తమ క్రెడిట్ గా టీడీపీ నేతలు చెబుతున్నారు. అయితే, భూముల సేకరణ.. పరిహారం చెల్లింపు.. నిర్వాసితులకు భూముల కేటాయింపుతో సహా శంకుస్థాపన వరకు అన్నీ తమ హయాంలోనే జరిగాయని మాజీ సీఎం జగన్ చెప్పుకొచ్చారు. తానే శంకుస్థాపన చేసానని.. 2026 లో ప్రారంభం అవుతుందని ముందుగానే చెప్పామని వివరించారు. అయితే, ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం గురించి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. విశాఖ డీఆర్సీ సమావేశంలో ఈ అంశం పైన ఆయన ప్రత్యేకంగా ప్రస్తావన చేసారు. కీలక సూచనలు అందించారు.

భోగాపురం విమానాశ్రయం పైన విష్ణు కుమార్ రాజు కొత్త విశ్లేషణ చేసారు. భోగాపురం ఏయిర్ పోర్టు కు వెళ్లటం కంటే వందేభారత్ తో విజయవాడ వెళ్లటం సులభమని వ్యాఖ్యానించారు. ఎంపీ భరత్ చొరవ తీసుకొని రెండు వందేభారత్ లు ఏర్పాటు చేయాలని వ్యంగాస్త్రాలు సంధించారు. విశాఖ విమానాశ్రయం కొనసాగించాలని సూచించారు. భోగాపురం ఏయిర్ పోర్టు కనెక్టివిటీ రోడ్లు పూర్తి కావటానికి సమయం పడుతుందని చెప్పుకొచ్చారు. విశాఖ విమానాశ్రయం మూసివేత ఆలోచన పైన ప్రభాభిప్రాయం తీసుకోవాలని కోరారు. విశాఖ ఏయిర్ పోర్టు మూసివేతకు తాను వ్యతిరేకమని పేర్కొన్నారు. భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే రోడ్లు పూర్తయ్యే వరకూ విశాఖ వాసులకు వందే భారత్ అందుబాటులోకి తీసుకొస్తే వెసులుబాటు కలుగుతుందని చెప్పారు. దీంతో.. ఇప్పుడు విష్ణు కుమార్ రాజు వ్యాఖ్యలు కూటమిలో చర్చగా మారాయి.












Click it and Unblock the Notifications