అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బాబుకు సాధ్యం: ఆకాశానికెత్తి జాతీయ నేతలు, స్థానికుల ఉత్సాహం నీరుగార్చలేక..

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన జాతీయ నాయకులు ప్రశంసలు కురిపించారు. చంద్రబాబుకు అభినందనలు తెలిపారు. అమరావతి నిర్మాణం భారతీయ సంస్కృతికి పట్టం కట్టటడమేనని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా అన్నారు.

శాతవాహనలు, ఇక్ష్వాకులు, చోళులు పాలించిన నేల పైన ఏపీ నూతన రాజధాని నిర్మాణం మన సంస్కృతికి పట్టం అని అమిత్ షా అన్నారు. ప్రపంచ రాజధానిగా అమరావతి కట్టగల కార్యదక్షత చంద్రబాబుకు ఉందని నితిన్ గడ్కరీ ఆకాశానికెత్తారు. ప్రపంచంలో అమరావతి అందమైన నగరంగా ఉంటుందని వికె సింగ్ అన్నారు.

అమరావతికి పెరిగిన సందడి

అమరావతి రాజధానికి సమయం దగ్గర పడుతుండటంతో సామాన్యులు, ప్రముఖులు తరలి వస్తున్నారు. గురువారం నాడు రావడం కష్టమవుతుందని భావించి.. చాలామంది బుధవారమే వస్తున్నారు. మరోవైపు స్థానికులు శంకుస్థాపన వేదికను చూసేందుకు భారీగా తరలి వస్తున్నారు.

BJP leaders Praises CM Chandrababu

దీంతో, రాకపోకల పైన ఆంక్షలు విధించారు. భద్రతా కారణాల నేపథ్యంలో ఆంక్షలు విధించారు. ఉద్దండరాయనిపాలెంలో విపరీతంగా రద్దీ పెరిగింది. శంకుస్థాపన కార్యక్రమాలకు ఆటంకం కలిగినా, కుటుంబ సభ్యులతో, స్నేహితులతో స్థానికులు సెల్ఫీలు దిగినా.. వారి ఉత్సాహం నీరుగార్చలేక పోలీసులు అంగీకరించారు.

అయితే, రాజధాని శంకుస్థాపన ముహూర్తం దగ్గర పడటంతో కేంద్ర నిఘా సంస్థ, ప్రధాని ప్రత్యేక భద్రతా సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆంక్షలు విధించారు. సందర్శకులకు అనుమతి లేదని ప్రకటించారు.

అమరావతి శంకుస్థాపన షెడ్యూల్ ఇదీ...

మధ్యాహ్నం 12.30 గంటలకు శంకుస్థాపన ప్రాంతానికి ప్రధాని మోడీ చేరుకుంటారు.
12.30-12.35 మధ్య మోడీ అమరావతి గ్యాలరీ సందర్శిస్తారు.
12.35-12.43 మధ్య శంకుస్థాపనలో పాల్గొంటారు.
12.43-12.45 మధ్య ప్రధాన వేదిక వద్దకు ప్రధాని మోడీ చేరుకుంటారు.
12.45-12.48 మధ్య ప్రధానికి, అతిథులకు పుష్పగుచ్చాలు అందిస్తారు.
12.48-12.50 వరకు మా తెలుగు తల్లికి గీతాలాపన
12.50-12.53 వరకు జపాన్ మంత్రి యోసుకే తకాగి ప్రసంగిస్తారు.
12.53-12.56 సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రసంగం.
12.56-1.01 వరకు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రసంగం.
1.01 - 1.11 వరకు ఏపీ సీఎం చంద్రబాబు ప్రసంగం.
1.11 - 1.43 వరకు ప్రధాని మోడీ ప్రసంగిస్తారు.
1.43 - 1.46 వరకు ప్రధాని, అతిథులకు జ్ఞాపికలు.

English summary
BJP leaders praised AP CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X