ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో వైఎస్ భారతీ రెడ్డికి లింక్ ? జగన్ కేసులతో షాక్..జమ్మలమడుగు ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ రాక్షస పాలన అంతం అయ్యిందని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అసెంబ్లీలో కూడా అడుగుపెట్టే పరిస్థితి లేదని, ఓకవేళ అసెంబ్లీలో అడుగుపెడితే జగన్ కు చుక్కలు చూపిస్తామని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో జగన్ భార్య వైఎస్ భారతీ రెడ్డికి సంబంధాలు ఉన్నాయని, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

జమ్మలమడుగు కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన తరువాత విజయవాడ వెళ్లారు. గురువారం విజయవాడలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతీ రెడ్డి మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జగన్ భార్య భారతీ రెడ్డి పేరు ఉందని, ఆమె పేరు కూడా త్వరలో బయటకు వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారయణ రెడ్డి ఆరోపించారు.

BJP MLA Adinarayana Reddy Alleges YS Bharti Reddy s Connection With Delhi Liquor Scam Case

మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు కూడా వేగవంతం అవుతుందని, ఇంతకాలం సీఎం పదవిలో ఉంటూ కేసు విచారణ నుంచి తప్పించుకున్న జగన్ కు ఇక ముందు అలాంటి చాన్స్ లేదని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఇటీవల వైసీపీ పార్టీ నుంచి గెలుపొందిన కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతామని మమ్మల్ని అడుగుతున్నారని, అయితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి ఆలోచించి అలాంటి వారి గురించి బీజేపీ హైకమాండ్ ఆచితూచి ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు.

ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నాయకుల అరాచకాలు తట్టుకున్న ప్రజలు ఇక ఓపికలేక ఆ పార్టీ నాయకులకు సినిమా చూపించారని, కూటమి నాయకులకు పట్టంకట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముద్దాయి అని, అతని మీద చట్టపరంగా అధికారులు చర్యలు తీసుకుంటారని, అతనికి కూడా త్వరలో సినిమా కనపడుతుందని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలం పెరిగిందని, అందుకే 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు విజయం సాధించారని ఆదినారాయణ రెడ్డి మీడియాకు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని, బీజేపీ, టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కూడా ప్రజలకు న్యాయం చెయ్యడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారని, అందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయ రెడ్డి అన్నారు. ఇంతకాలం ఆంధ్రప్రదేశ్ ప్రజలను టార్చర్ పెట్టి వారిని హింసించిన వైసీపీ నాయకులకు త్వరలో ప్రజలే తగినబుద్ది చెబుతారని, ఆ రోజులు దగ్గర్లోనే ఉన్నాయని జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+