పోలవరం కేంద్ర ప్రాజెక్టు, ఢిల్లీలో ఎందుకు: చంద్రబాబుకు ఆకుల కౌంటర్
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు అని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. నిధుల విషయంలో ఎలాంటి సమస్య లేదని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చెప్పారని గుర్తు చేశారు. ఏదైనా సమస్య ఉంటే కేంద్రానికి చెప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు హితవు పలికారు.
భూసేకరణ ఖర్చు ఎందుకు రెట్టింపు అయిందో చెప్పాలని ప్రశ్నించారు. డ్యాం పొడవు, వెడల్పు పెరగనప్పుడు ఖర్చు ఎందుకు పెరిగిందో చెప్పాలని నిలదీశారు. సచివాలయాన్ని ఢిల్లీలో పెట్టడం ఎందుకని ఎద్దేవా చేశారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం పాజిటివ్‌గా ఉంటే చంద్రబాబు నెగిటివ్‌గా ఆలోచిస్తున్నారని చెప్పారు.

ఇదే స్ఫూర్తి కొనసాగించాలి: మంత్రి
సమిష్టిగా పనిచేస్తూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి కృషి చేస్తోన్న ఆ శాఖ అధికారులు ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తితో పని చేయాలని మంత్రి అమర్నాథ్ రెడ్డి సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఏపీకి ప్రథమ స్థానం దక్కడంతో.. పరిశ్రమలశాఖ అధికారులు సచివాలయంలో మంత్రిని కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు.
ఈ సందర్భంగా అమర్నాథ్ రెడ్డి మాట్లాడారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో ఏపీకి అగ్రస్థానం దక్కడంలో అధికారులు చేసిన కృషి ఎంతో ఉందన్నారు. సీఎం చంద్రబాబు ఆలోచనలకు తగినట్లు పనిచేస్తూ పారిశ్రమిక ప్రగతికి సహకరించారన్నారు. ఇదే స్ఫూర్తితో పని చేయాలన్నారు.
-
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్












Click it and Unblock the Notifications