అన్నం తినే వైసీపీకి ఓట్లు వేసారా..!!

బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అనుచిత వ్యాఖ్యలు చేసారు. అసెంబ్లీలో వైసీపీకి ఓటు వేసిన వారి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాదస్పదమయ్యాయి. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానం పై చర్చలో భాగంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పైన ప్రశంసలు గుప్పిస్తూ...జగన్ పాలన పైన విమర్శలు కొనసాగించారు. ఆ సమయంలోనే విష్ణుకుమార్ రాజు వైసీపీకి ఓటు వేసిన వారి పైన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వైసీపీకి ఎన్నికల్లో 40 శాతం ఓట్లు పోలైన అంశాన్ని విష్ణు కుమార్ రాజు చెప్పుకొచ్చారు. వైసీపీకి ఓట్లు వేశారంటే వాళ్లు అన్నం తినే వేసారా..మనసుతో ఆలోచించి ఓట్లు వేశారా..ఏ విధంగా ఓట్లు వేశారో అర్దం కావటం లేదంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ అయిదేళ్ల పాలన చూసిన తరువాత కూడా ఈ విధంగా ఓట్లు వేయటం పై ఆలోచించాలని అని అన్నారు. విష్ణుకుమార్ రాజు అసెంబ్లీ వేదికగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

BJP mla Vishnu Kumar Raju Controversial comments over YSRCP voters details here

వివేకా హత్య అంశం పైన విష్ణుకుమార్ రాజు స్పందించారు. ఈ కేసును సీబీఐ విచారణకు అప్పగించాలి..శాస్త్రీయ పద్దతిలో విచారించాలన్నారు. పక్కన ఉన్న సభ్యులు ఇప్పటికే సీబీఐ విచారణ జరుగుతోందని చెప్పగా..విచారణను వేగవంతం చేయాలని కప్పి పుచ్చకొనే ప్రయత్నం చేసారు. దీని పైన స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీని పై సీబీఐ దర్యాప్తు చేసిందని..త్వరలో తీరపు వచ్చేలా చేసి అసలైన హంతకులను శిక్షిస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+