టీడీపీపై మరోసారి నిప్పులు చెరిగిన బీజేపీ సోము వీర్రాజు
అమరావతి: తెలుగుదేశం పార్టీ చేయాల్సింది ట్రేడింగ్ కాదని, రూలింగ్ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. మంగళవారం టీడీపీపై దుమ్మెత్తి పోసిన ఆయన బుధవారం కూడా మండిపడ్డారు.
Recommended Video

ఆయన పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో విలేకరులతో మాట్లాడారు. ఇసుక, ఎన్ఆర్జీఎస్, ఎర్ర చందనం, గ్రానైట్ నిధులు ఎక్కడికి పోతున్నాయో చెప్పాలని ఆయన నిలదీశారు.

కాకినాడ మున్సిపలిటీ ఎన్నికలలో గెలుపుకు టీడీపీ వక్రభాష్యం చెబుతోందని ధ్వజమెత్తారు. మిత్రపక్షంగా ఉన్న టీడీపీ.. బీజేపీకి కేటాయించిన సీట్లలో పోటీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ పార్టీకి చెందిన మంత్రి మాణిక్యాల రావుకు కనీస గౌరవం ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో తమ పార్టీ బలోపేతం అవుతుంటే టీడీపీ నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. టిడిపితో పొత్తు పెట్టుకున్నప్పుడల్లా తమ పార్టీ మోసపోయిందని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications