కరోనాను జయించిన సీఎం రమేశ్.. సంతోషంగా ఉందని ట్వీట్..
బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ కరోనా వైరస్‌ను జయించారు. తనకు కరోనా నెగిటివ్ వచ్చిందని తెలిపారు. రెండువారాల క్రితం ఆయనకు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఇవాళ వైరస్ తగ్గిందని ట్వీట్ చేశారు. ఇటీవల చేసిన పరీక్షల్లో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని రమేశ్ తెలిపారు.
తనకు వైరస్ తగ్గినందుకు ఆ భగవంతుడికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. తాను వైరస్ నుంచి కోలుకోవాలని ప్రార్థించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ బరినుంచి బయటపడేందుకు సహకరించిన వైద్యులు, సిబ్బందికి కూడా థాంక్స్ చెప్పారు. కుటుంబసభ్యుల బలం, తన మనోధైర్యంతో వైరస్‌ను జయించానని తెలిపారు. వైరస్ నుంచి కోలుకున్నందున త్వరలో కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పారు.

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది. నేతలకు కూడా వైరస్ సోకుతోంది. పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు కూడా కరోనా బారినపడ్డారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా కరోనా వైరస్ జయించారు. అపోలో ఆస్పత్రిలో 10 రోజులు చికిత్స తీసుకున్నాక కోలుకున్నారు.












Click it and Unblock the Notifications