• search
  • Live TV
తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తిరుపతి ఉపఎన్నిక: ఈ ప్రాంతానికి జగన్ చేసిందేంటి? వ్యక్తిగత సేవకు ఎంపీ టికెట్టా? బీజేపీ ఎన్నికల నినాదమిదే...

|

తిరుపతి ఉపఎన్నిక వేళ వైసీపీ-బీజేపీ మధ్య మాటల యుద్దం నడుస్తోంది. నిన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి,బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మధ్య ట్విట్టర్ వేదికగా వాడి వేడి మాటల తూటాలు పేలిన సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు వైసీపీపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. వ్యక్తిగత సేవ చేసినందుకు గురుమూర్తికి ఎంపీ టికెట్ ఇస్తారా అంటూ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించారు. మంగళవారం(మార్చి 30) తిరుపతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.

తిరుపతికి జగన్ చేసిందేంటి...?

తిరుపతికి జగన్ చేసిందేంటి...?

'తిరుపతి నియోజకవర్గంలో కేంద్రం చేసిన అభివృద్ది ప్రజల కళ్ల ముందు ఉంది. నియోజకవర్గ అభివృద్దిపై వైసీపీ,టీడీపీ బీజేపీతో చర్చకు సిద్దమా... బీజేపీ చేసిన అభివృద్దిని,గత పాలకుల వైఫల్యాన్ని జనాల్లోకి తీసుకెళ్తున్నాం.' అని జీవీఎల్ పేర్కొన్నారు. తిరుపతి రైల్వే స్టేషన్‌ను రూ.700 కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఆధునీకరిస్తోందని చేస్తోందని చెప్పారు. అలాగే తిరుపతిలో విమానాశ్రయం,విద్యా సంస్థలు,హైవేలు,ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్స్ తదితర అభివృద్ది పనులను కేంద్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. కేంద్రం ఇంత చేస్తుంటే... మరి సీఎం జగన్ తిరుపతికి చేసిందేంటి అని జీవీఎల్ ప్రశ్నించారు.

వ్యక్తిగత సేవ చేస్తే టికెట్ ఇస్తారా?

వ్యక్తిగత సేవ చేస్తే టికెట్ ఇస్తారా?

వైసీపీ అభ్యర్థి గురుమూర్తి గురించి ప్రస్తావిస్తూ... సీఎం జగన్‌కు వ్యక్తిగత సేవలు అందించినంత మాత్రాన ఎంపీ టికెట్ ఇస్తారా అని ప్రశ్నించారు. అసలు గురుమూర్తి ప్రజలకు చేసిన సేవ ఏంటి అని ప్రశ్నించారు. జగన్‌కు సేవలు అందించినవారికి ఎన్నికల్లో గెలిచే అర్హత ఉందా... లేక 40 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసిన బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారికి ఎన్నికల్లో గెలిచే అర్హత ఉందా అన్నది జనంలోకి తీసుకెళ్తామన్నారు. వ్యక్తిగత సేవలు చేసినవారికి ఇచ్చేందుకు నామినేటెడ్ పదవులు చాలానే ఉన్నాయన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నినాదం 'జగన్ సేవ వర్సెస్ జనం సేవ' అని చెప్పారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థిని గెలిపిస్తే ఇప్పటికే ఆ పార్టీకీ ఉన్న 21 మంది ఎంపీలకు మరో ఎంపీ తోడవుతారని... అంతకుమించిన విశిష్ఠత ఏమీ ఉండదని అన్నారు. అదే బీజేపీని గెలిపిస్తే తిరుపతిని అభివృద్ది చేసి చూపిస్తారని చెప్పారు.

వైసీపీని గెలిపిస్తే నాయకుడి సేవలో తరిస్తారు : జీవీఎల్

వైసీపీని గెలిపిస్తే నాయకుడి సేవలో తరిస్తారు : జీవీఎల్

దివంగత తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ తిరుపతి ప్రజలకు చేసిందేమీ లేదని జీవీఎల్ విమర్శించారు. ఈ విషయం ప్రజలే చెప్తున్నారని అన్నారు. ఆయనే కాదు ఇదివరకు తిరుపతి ఎంపీగా పనిచేసినవాళ్లెవరూ ఈ ప్రాంత అభివృద్దిని పట్టించుకోలేదన్నారు. అంతా సొంత లాభం చూసుకున్నవాళ్లేనని ఆరోపించారు. తిరుపతిలో మళ్లీ వైసీపీని గెలిపిస్తే... గెలిచే వ్యక్తి మరింత ఎక్కువగా వారి నాయకుడి సేవలో నిమగ్నమవుతారని ఎద్దేవా చేశారు. అదే బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలకు సేవ చేస్తారని చెప్పారు. కాబట్టి ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. వైసీపీ,గత ప్రభుత్వాల హిందూ వ్యతిరేక విధానాలను కూడా జనంలోకి తీసుకెళ్తామన్నారు. కచ్చితంగా తిరుపతి ఎన్నికలో బీజేపీ-జనసేన కూటమి విజయం సాధిస్తుందన్నారు. ఇక టీడీపీ,చంద్రబాబు పని అయిపోయిందని... ఆ పార్టీ ఆవిర్భావ సభలు శోక సభల్లా జరిగాయని ఎద్దేవా చేశారు.

English summary
BJP Rajya Sabha member GVL Narasimha Rao slammed the YSRCP. YSRCP candidate. GVL criticised that CM Jagan gave ticket to Gurumurthy for his personal services to him. He spoke to media conference held in Tirupati on Tuesday (March 30).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X