బచ్చా చిటికేస్తే బాబు ఢిల్లీకి వెళ్లడమా?...ఇది తెలుగువారి ఆత్మగౌరవాన్ని కించపర్చడం కాదా?:జీవీఎల్
విజయవాడ:టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈసారి మాటల యుద్దానికి ట్విట్టర్ వేదికయింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద తెలుగుకు స్థానం కల్పించకపోవడం ద్వారా తెలుగువారి ఆత్మగౌరవాన్ని బిజెపి మరోసారి దెబ్బతీసిందని మంత్రి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎంపి జివిఎల్ స్పందించారు.
మరి చంద్రబాబు అనుభవంతో పోలిస్తే బచ్చా అయిన అఖిలేష్ చిటిక వేస్తే ఢిల్లీకి బయలుదేరి వెళ్లడం తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినట్లు కాదా?...అని ఎంపి జివిఎల్ ప్రశ్నించారు. చంద్రబాబు అనుభవాన్ని...ఆయన తాజా ఢిల్లీ పర్యటనను ఉదహరిస్తూ ఎంపి జివిఎల్ ట్విట్టర్ లో వ్యంగాస్త్రాలు సంధించారు.

బచ్చా చిటికెస్తే...ఢిల్లీకా
చంద్రబాబు ఢిల్లీ పర్యటన గురించి బిజెపి ఎంపి జివిఎల్ ఏమని ట్వీట్ చేశారంటే?...."చంద్రబాబు నాయుడు గారు 1978 లో ఎమ్మెల్యే,1980 లో మంత్రి అయ్యారు. అప్పుడు 5 ఏళ్ల వయసున్న అఖిలేష్ యాదవ్ డైపర్లు వేసుకునే వయసు వాడు...అందరి కంటే సీనియర్ ను అని చెప్పుకునే చంద్రబాబునాయుడికి 'బచ్చా' అఖిలేష్ చిటికేస్తే ఢిల్లీకి వెళ్ళటం సిగ్గనిపించటం లేదా?...ఇది తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కించపరచడం కాదా?"...అని ప్రశ్నించారు.

అందుకే...అవినీతి కూటమి
ఆ తరువాత చంద్రబాబు ఢిల్లీ పర్యటనను ఉద్దేశించి చంద్రబాబు ఆంగ్లంలో మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏమిటంటే?..."ఎపిలో టిడిపి ప్రభుత్వం అనేక కుంభకోణాల్లో(ఐటి, పిడి ఖాతాల, ఇరిగేషన్ స్కామ్ మొదలైనవి) చిక్కుకుంది... ఆ పార్టీ ఎంపీలు నిధుల దుర్వినియోగం, పన్ను ఎగవేత వంటి వాటిల్లో విచారణలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో ఢిల్లీలో తమకు అనుకూలమైన ఒక 'అవినీతి కూటమి'ని కూర్చడానికి పరుగులు పెడుతున్నాడు"
అని జివిఎల్ ట్వీట్ చేశారు.

తెలుగుకు...గుర్తింపు ఏదీ
అంతకుముందు స్టాట్యూ ఆఫ్ యూనిటీ వద్ద తెలుగుకు గుర్తింపు లేకపోవడాన్ని ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ చేశారు. భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగుకు స్టాట్యూట్ ఆఫ్ యూనిటీ వద్ద గుర్తింపు లభించకపోవడం తెలుగు బిడ్డగా తన మనసు క్షోభిస్తోందని మంత్రి నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో కూడా తెలుగువారంటే కేంద్రానికి ఇంత వివక్షా? అని నిలదీశారు.

ఆత్మగౌరవం...దెబ్బతీసారు
ప్రతి ఒక్క తెలుగు వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేయాల్సిన తరుణమిదని అన్నారు. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో నరేంద్ర మోదీ సఫలీకృతం అయ్యారు.. కానీ పటేల్ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగుని విస్మరించడం ద్వారా భాజపా తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి దెబ్బతీసిందని లోకేశ్ ఆక్షేపించారు.
-
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
SRH vs RR: ట్రాక్ రికార్డ్ వర్సెస్ ఫామ్-ఆ ఒక్కడే గేమ్ ఛేంజర్ ..! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి ఉన్నవారి మే నెల జాతక ఫలం -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్











Click it and Unblock the Notifications