కాంగ్రెస్‌కు బీజేపీ ఝలక్: 'కేవీపీ బిల్లును చర్చకు రానివ్వం', టీడీపీ వెనక్కి?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపీ కంభపాటి హరిబాబు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్‌లో పెను కలకలం సృష్టించనున్నాయా? అంటే అవుననే అంటున్నారు. వివరాల్లోకి వెళితే... ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు జులై 22 (శుక్రవారం) చర్చకు రానుంది.

ఈ క్రమంలో కేవీపీ ప్రైవేట్ మెంబర్ బిల్లును పాస్ చేయించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ వివిధ పార్టీలకు చెందిన నేతలతో చర్చలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ బిల్లుకు ఇప్పటికే జాతీయ స్థాయిలో ఆరు పార్టీలు తమ మద్దతుని ప్రకటించాయని ఏపీ పీసీసీ ఛీప్ రఘవీరారెడ్డి మంగళవారం మీడియాతో వివరించారు.

కేవీపీ ఎఫెక్ట్: బాబుని ఇరికిస్తున్న కేసీఆర్, ప్లాన్ వెనుక, వెంకయ్య చక్రం!
అంతేకాదు ఢిల్లీలోనే ఉంటూ వివిధ పార్టీ నేతలను కలుస్తూ ఆయన వ్యూహాలకు పదను పెట్టారు. మరోవైపు టీడీపీ, బీజేపీ సైతం తమ తమ వ్యూహాలకు పదను పెడుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా కేవీపీ బిల్లుకు మద్దతు పలకాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునా తన పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మొదటి నుంచి కూడా ఏపీకి ప్రత్యేకహోదా సాధ్యం కాదని చెబుతున్న బీజేపీ రాజ్యసభలో కేవీపీ ప్రవేశపెట్టిన బిల్లుపై ఏ విధంగా వెళుతుందో అనే దానిపై ఉన్న సందిగ్ధత బుధవారం ఉదయంతో వెల్లడైంది. ఏపీ బీజేపీ శాఖ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు ఈరోజు ఉదయం ఓ న్యూస్ ఛానెల్ నిర్వహించిన చర్చలో పాల్గొన్నారు.

Bjp Mp Haribabu fires over kvp private member bill

ఈ సందర్భంగా కేవీపీ ప్రైవేట్ బిల్లుపై బీజేపీ వైఖరిని ఆయన వెల్లడించారు. ఏపీకి ప్రత్యేకహోదా కంటే ఎక్కువే చేస్తున్నామని చెప్పిన ఆయన రాజ్యసభలో అసలు కేవీపీ బిల్లు చర్చకు రానివ్వమని ఆయన సంచలన ప్రకటన చేశారు. దీంతో పాటు ప్రత్యేకహోదా కంటే ఏపీకి ఎక్కువ ప్రయోజనాలనే అందిస్తున్నామని, ప్రత్యేకహోదా అవసరం లేదని తేల్చి చెప్పారు.

కేవీపీ ప్రైవేట్ బిల్లుని రాజ్యసభలో పాస్ చేయించుకునేందుకు కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఎంపీ హరిబాబు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. మరోవైపు కేవీపీ బిల్లుకు మద్దుతు తెలిపేందుకు తాము సిద్దమంటూ చెప్తున్న టీడీపీ కూడా మాట మార్చింది.

బీజేపీ వ్యాఖ్యలకు మద్దతుగా కేంద్ర మంత్రి సుజనా చౌదరి కూడా మాట్లాడటం ఇప్పుడు పెద్ద చర్చకు తావిస్తోంది. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేవీపీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుతో ఎటువంటి ఉపయోగం లేదని చెప్పారు. ఏపీలో పోయిన తమ ఉనికిని కాపాడుకునేందుకే ఈ బిల్లును తెచ్చారని ఆయన ఎద్దేవా చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కోసం కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుతున్నామని ఆయన చెప్పారు. ఏపీకి ఎప్పుడు ఏం చేయాలో కేంద్రానికి అంతా తెలుసుని ఆయన వ్యాఖ్యానించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Bjp Mp Haribabu fires over kvp private member bill.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి