డీపీ మార్చిన పురందేశ్వరి..!!
Purandeswari: ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు, రాజమండ్రి లోక్‌సభ సభ్యురాలు రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని ప్రకటించిందని, ఆ రోజున ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతకాన్ని ఎగురవేయాలని సూచించారు.
రాష్ట్రంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆమె కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటిపై జాతీయ పతకాన్ని ఎగురవేయాలని విజ్ఞప్తి చేశారు. అప్పుడే స్వాతంత్ర్య సమరయోధులకు అసలైన నివాళి అర్పించినట్టవుతుందని చెప్పారు.

ఈ మేరకు ఓ వీడియోను పురంధేశ్వరి విడుదల చేశారు. స్వాతంత్ర్యం కోసం తమ ముందు తరాల వారు ఎన్నో త్యాగాలు చేశారని పురందేశ్వరి గుర్తు చేశారు. మన భావి తరాల వారికి స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని, నాటి సమరయోధులు చేసిన ప్రాణ త్యాగాలను గుర్తు చేయాలని కోరారు. ఇందులో పెద్ద ఎత్తున పిల్లలను భాగస్వామ్యులను చేయాలని సూచించారు.
మూడు సంవత్సరాల కిందట హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దీన్ని క్రమం తప్పకుండా కొనసాగిస్తూ వస్తోంది. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేయడాన్ని ఆనవాయితీగా మారింది.
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఫేస్ బుక్, ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సవ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై అకౌంట్స్ ఉన్న ప్రతి ఒక్కరూ తమ డీపీని త్రివర్ణపతక రూపంలోకి మార్చుకోవడం కూడా ఆరంభమైంది అప్పటి నుంచే. ఇందులో భాగంగా పురంధేశ్వరి తన అధికారిక ఎక్స్ అకౌంట్ డీపీలో జాతీయజెండాను చేర్చారు.












Click it and Unblock the Notifications