రాబోయే 20 ఏళ్లు ఏపీలో కాంగ్రెస్ గెలిచే పరిస్ధితి లేదు: మురళీ మోహన్

హైదరాబాద్: రాబోయే 20 సంవత్సరాల్లో ఏపీలో కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలు లేవని టీడీపీ ఎంపీ మురళీమోహన్‌ అన్నారు. గురువారం ఏపీకి చెందిన టీడీపీ, బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రి సుజనా చౌదరి నివాసంలో సమావేశం భేటీ అయ్యారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వలాభం కోసం, రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని విడదీశారని అన్నారు. ఏపీ హక్కుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌ నేతలకు లేదని ఆయన అన్నారు.

bjp mp Venkaiah Naidu Assures Andhra Pradesh of Special Status

ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రశాంతంగా పడుకోవాలన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఏపీకి తీవ్ర నష్టం కలిగిందన్నారు. విభజనచట్టంలో పేర్కొన్న అన్ని హామీలను దశలవారీగా అమలు చేస్తామన్నారు.

అన్నిహామీలు సక్రమంగా అమలయ్యేందుకు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం ఏపీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం అమలు చేసేందుకు ప్రత్యేకించి నోడల్ అధికారిని నియమించాలని రాజ్‌నాథ్‌ను కోరామని అన్నారు.

కేంద్ర అదనపు కార్యదర్శి ఏకేసింగ్‌ను నోడల్‌ అధికారిగా నియమించేందుకు రాజ్‌నాథ్‌ అంగీకరించారని ఆయన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా పట్ల ప్రధాని నరేంద్రమోడీ దిష్టిబొమ్మలను దహనం చేయడం సరికాదన్నారు. ఏపీ విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చలేదన్నారు. ప్రత్యేక హోదా విషయంలో తనపైనా, బీజేపీపైనా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+