BJP కాపు రాజకీయం.. వారెవా.. అదిరిందిగా?

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంవల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో అటువంటి పరిస్థితిని పునరావృతం కానివ్వనని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు

కాపులు.. ప్రస్తుతం ఏపీలో అత్యధిక డిమాండ్ కలిగివున్న సామాజికవర్గం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన పొత్తుపెట్టుకొని పోటీచేయడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో కాపుల ఓట్లన్నీ ఆ రెండుపార్టీలకు గుంపగుత్తగా పడతాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీచేయడంవల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 50 నుంచి 55 నియోజకవర్గాల్లో లాభం చేకూరింది.

 ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా..

ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా..


ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడంవల్లే వైసీపీ అధికారంలోకి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో అటువంటి పరిస్థితిని పునరావృతం కానివ్వనని జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అప్పటి నుంచి జనసేనకు, వైసీపీకి మధ్య పోరు హోరాహోరీగా నడుస్తోంది. భారతీయ జనతాపార్టీ నేతలు తమకు జనసేనతో పొత్తుందని చెబుతున్నారు. జనసేనవైపు నుంచి ఎటువంటి స్పందన ఉండటంలేదు. టీడీపీ-జనసేన కలిసి వెళ్లడం ఖాయమైన నేపథ్యంలో బీజేపీని కూడా కలుపుకొని వెళ్లడానికి చివరి వరకు ఎదురుచూడాలని ఈ రెండు పార్టీల అధినేతలు నిర్ణయించారు.

జిల్లాకు వంగవీటి రంగా పేరు

జిల్లాకు వంగవీటి రంగా పేరు


ఏపీలోని ఒక జిల్లాకు కాపుల ఆరాధ్య దైవమైన వంగవీటి రంగా పేరు పెట్టాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు డిమాండ్ చేస్తున్నారు. దేశంలో ఏ సామాజికవర్గానికి జరగనంత అన్యాయం కాపులకు జరిగిందని, వారి రిజర్వేషన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నరాని, గత టీడీపీ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ భూ దోపిడీ చేయడానికి, కుంభకోణాలు జరగడానికి ఆస్కారం ఉందో అక్కడే జగన్ సర్కార్ పనిచేస్తోందంటూ జీవీఎల్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. అకస్మాత్తుగా బీజేపీ కాపుల కోసం వారి తరఫున మాట్లాడటం వెనక అనేక రాజకీయ కారణాలు దాగివున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలుగుదేశం, వైసీపీ రెండు వేర్వేరు సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం వహించే పార్టీలుగా చెలామణి అవుతున్నాయి.

కాపుల దన్నుతో ఏపీలో బీజేపీకి అధికారం?

కాపుల దన్నుతో ఏపీలో బీజేపీకి అధికారం?


ఇటువంటి తరుణంలో 22 శాతానికి పైగా ఉన్న కాపులను సొంతం చేసుకోగలిగితే ఏపీలో అధికారంలోకి రావడం సులభమని బీజేపీ పెద్దలు ప్రణాళికలు రచించారు. ప్రధానమంత్రి భీమవరం పర్యటనకు చిరంజీవిని ఆహ్వానించడం, పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తమవైపే ఉండేలా ఒత్తిడి తెస్తుండటంతోపాటు కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజునే మరోసారి అధ్యక్ష పదవిలో కొనసాగిస్తోంది. తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీ నష్టపోతుందని, సాధ్యమైన మేరకు కాపుల ఓట్లలో చీలిక తీసుకురావడంద్వారా ఈ పొత్తుకు గండి కొట్టాలని అధికార పార్టీ యోచిస్తోంది. బీజేపీ చేస్తున్న రాజకీయం కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చివరకు కాపులు ఎవరికి పట్టం కడతారోకానీ వారి ఓట్ల కోసం మాత్రం రాజకీయ పార్టీల ఫీట్లు సర్కస్ ను తలపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+