2019లో టిడిపితో పొత్తుపై భిన్నాభిప్రాయాలు, బాబుపై కమలం అసంతృప్తికి కారణమిదే!

Posted By:
Subscribe to Oneindia Telugu
  BJP-TDP alliance in 2019 polls బాబుపై కమలం అసంతృప్తికి కారణమిదే! | Oneindia Telugu

  ఒంగోలు: 2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తును కొనసాగించాలా లేదా అనే అంశంపై బిజెపి నేతలు తర్జనభర్జన పడుతున్నారు. ఒంగోలులో జరిగిన బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో 2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు విషయమై నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.అయితే వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఓటింగ్ శాతాన్ని పెంచుకోవాలనే పదాధికారుల సమావేశంలో పార్టీ నేతలు అభిప్రాయానికి వచ్చారు.

  బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశం ఒంగోలులో రెండురోజుల పాటు జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.

  2019 ఎన్నికలవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిడిపితో పొత్తు కొనసాగుతోందని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఇప్పటికే ప్రకటించారు అయితే 2019 ఎన్నికల్లో టిడిపితో కలిసి వెళ్ళాలా, వద్దా అనే విషయమై బిజెపి నేతల్లో అంతర్మథనం మొదలైంది.

  నంద్యాల, కాకినాడ ఉపఎన్నికల ఫలితాలు బిజెపి నేతల్లో కూడ కొత్త ఆలోచనలకు కారణంగా మారాయంటున్నారు. టిడిపితో పొత్తును వ్యతిరేకించిన నేతలంతా కూడ ప్రస్తుతం ఈ విషయమై గట్టిగా తమ అభిప్రాయాన్ని బయటకు వెల్లడించే పరిస్థితి లేకుండా పోయిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

  2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తుపై భిన్నాభిప్రాయాలు

  2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తుపై భిన్నాభిప్రాయాలు

  2019 ఎన్నికల్లో టిడిపితో పొత్తు విషయమై బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో పొత్తు పెట్టుకొంటే ఎలా ఉంటుందనే విషయమై పదాధికారుల సమావేశంలో చర్చించారు. ప్రధానంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీపరంగా ఏవిధమైన ఎన్నికల వ్యూహం ఉండాలనే అంశంపై చర్చించారు. 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశంపార్టీతో పొత్తు ఉండవచ్చులేదా ఉండకపోవచ్చుననే అభిప్రాయానికి పదాధికారులు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.

  రెబెల్స్ వల్లే కాకినాడలో ఓటమి

  రెబెల్స్ వల్లే కాకినాడలో ఓటమి

  వచ్చే ఎన్నికలతో పాటు కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలపై కూడ చర్చించారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలపై కూడా పదాధికారులు పూర్తిస్ధాయిలో చర్చించారని తెలుస్తోంది.కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీకి తొమ్మిది స్ధానాలను టిడిపి కేటాయించింది.అయితే బిజెపికి కేటాయించిన స్థానాల్లో కూడ టిడిపి రెబెల్స్‌ను రంగంలోకి దించింది.దీంతో బిజెపి అభ్యర్థులు అనుకొన్న స్థాయిలో సీట్లను కైవసం చేసుకోలేదని రాష్ట్ర పదాధికారుల సమావేవంలో బిజెపి నేతలు అభిప్రాయపడ్డారు.

  జిల్లాల్లో టిడిపితో సత్సంబంధాలు లేవు

  జిల్లాల్లో టిడిపితో సత్సంబంధాలు లేవు

  రాష్టస్ధ్రాయిలో బిజెపి క్యాడర్‌తో తెలుగుదేశంపార్టీ నాయకులు సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ జిల్లాల్లో మాత్రం బిజెపి నేతలతో తెలుగు తమ్ముళ్ళు సఖ్యతగా ఉండటం లేదన్న అభిప్రాయానికి పదాధికారులు వచ్చారు. అయితే రెండు పార్టీల మధ్య సంబంధాలు ఉండాల్సిన అవసరం ఉందని ఈ సమావేశం అభిప్రాయపడింది.

  బస్సు యాత్ర నిర్వహణకు బిజెపి ప్లాన్

  బస్సు యాత్ర నిర్వహణకు బిజెపి ప్లాన్

  కేంద్రప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళేందుకు బస్సు యాత్రను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో చేయాలని పదాధికారులు నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను రాష్ట్రప్రభుత్వం హైజాక్‌చేసి వారి పథకాలుగా మార్చుకుంటున్న విషయాలపై కూడా పదాధికారులు చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాల పేర్లను మార్చకుండా రాష్ట్రప్రభుత్వం అదే పేర్లతో ప్రవేశపెట్టాలని పదాధికారులు తీర్మానించారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషిచేయాలని తీర్మానించారు. 2019ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెంచుకునే విధంగా చర్యలు తీసుకోవాలని పదాధికారులు అభిప్రాయానికి వచ్చారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Andhra pradesh Bjp leaders decided strenthen party in the state.Different opinions expressed bjp leaders with Tdp alliance in 2019 elections.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి