వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపి ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపి నిరసన.!కరోనా కట్టడిలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్న విష్షు.!

|
Google Oneindia TeluguNews

అమరావతి/హైదరాబాద్ : అమరావతిలో భారతీయ జనతా పార్టీ పోరాట బాట పట్టనుంది. కరోనా క్లిష్ట సమయంలో బాద్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం, ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్. విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈనెల 23 ఆదివారం, రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కరోనా రోగులను రక్షించడంలో ప్రభుత్వం చేతు లెత్తేసిందని ఘాటుగా విమర్శించారు. ప్రభుత్వం కరోనా కట్టడిపై చెప్పే మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయిని, చర్యలు మాత్రం శూన్యంగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.

ఏపి లో విజృంభిస్తున్న కరోనా.. ప్రభుత్వం నియంత్రించలేకపోతోందన్న బీజేపి

ఏపి లో విజృంభిస్తున్న కరోనా.. ప్రభుత్వం నియంత్రించలేకపోతోందన్న బీజేపి


కోవిడ్ మహమ్మారితో అమాయక ప్రజలు, వాస్తవాల్ని చూపించే ప్రయత్నంలో జర్నలిస్టులు సైతం మృత్యువాత పడుతున్నారని చనిపోతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు. ప్రయివేటు ఆసుపత్రుల దోపిడిలో అనేక మంది అధికార పార్టీ నేతలు హస్తం ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో 514 ప్రయివేటు ఆసుపత్రుల్లో కోవిడ్ కోసం బెడ్లు కేటాయించినట్లు చెబుతున్నారని అది పచ్చి అబద్దమని తెలిపారు. కనీసం 10 శాతం బెడ్లు కేటాయించలేదని ఆక్షేపించారు. ప్రభుత్వాసుపత్రుల్లో బెడ్లు లేక, ప్రైవేటు ఆసుపత్రుల్లో పేద రోగులను చేర్చుకోక రోగులు అల్లాడుతున్నారని మండిపడ్డారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతా అయోమయం.. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న విష్ణు..

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అంతా అయోమయం.. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారన్న విష్ణు..


ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రితో పాటు మంత్రులెవరైనా ఒక్క ఆసుపత్రినైనా సందర్శించారా అని ప్రశ్నించారు. ప్రయివేటు ఆసుపత్రిలో పేద రోగులను చేర్చుకున్నట్లు చెబుతున్నారని, ఏ ఒక్క ఆసుపత్రిలో అయినా 50 శాతం రోగులు చేర్చుకున్నట్లు నిరూపించగలరా అని ప్రభుత్వాన్ని పూటిగా ప్రశ్నించారు. పేదరోగులను ఆసుపత్రిలోకి అనుమతించడం లేదని దీనిపై ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చే ఆక్సిజన్, రేమిడిసివిర్ మందులు బ్లాక్ లో అమ్ముకొని దోపిడి చేసుకోవడానికి ఆరోగ్యశ్రీ పథకం ఉపయోగపడుతోందని ఆరోపించారు.

ఆగని ప్రయివేట్ ఆసుపత్రుల ఆగడాలు..ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న బీజేపి..

ఆగని ప్రయివేట్ ఆసుపత్రుల ఆగడాలు..ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న బీజేపి..


ఎంపీలు, ఎమ్మెల్యేలు వారి బంధువులకు సంబంధించిన ప్రైవేటు ఆసుపత్రులే ఎక్కువగా ఉన్నాయని, వారిపై ప్రేమతోనే ప్రభుత్వం ప్రయివేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవడం లేదని విష్ణు ఆరోపించారు. ఆక్సిజన్ కేటాయింపులతో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. 2.30 లక్షల కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టిన ఎపీ 2021-22 బడ్జెట్ లో ఆరోగ్యానికి ఎంత కేటాయించారని ప్రశ్నించారు. ఈ బడ్జెట్లో మెడికల్ కళాశాలలకు బడ్జెట్ ఎందుకు కేటాయించలేదని నిలదీసారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంతా ఒక బోగస్ అని వేల కోట్లు సంక్షేమానికి ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుని ప్రజలను మభ్యపెడుతున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు.

Recommended Video

Telangana Lockdown : రంజాన్ ముందు ఇలాగైతే ఓవైసీ చేతిలో కేసీఆర్‌కు దెబ్బలే - Bandi Sanjay
వచ్చే ఆదివారం నిరసన కార్యక్రమం.. వైసిపి ప్రభుత్వానికి బుద్ది చెబుతామన్న జేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

వచ్చే ఆదివారం నిరసన కార్యక్రమం.. వైసిపి ప్రభుత్వానికి బుద్ది చెబుతామన్న జేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


ఇదిలా ఉండగా కేంద్ర మార్గదర్శకాలు పాటించలేదు కాబట్టే కోర్టు ఎన్నికలు రద్దు చేసిందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల కోసం చేసిన ఖర్చును సీఎస్, ఎస్ఈసీ ల జీతం నుంచి వసూలు చేసి కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఏపీలో ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగుతూనే ఉన్నాయని, ప్రశ్నించిన, ఎదిరించిన వారిని అక్రమంగా అరెస్టులు చేయించి బెదిరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఈ నెల 23న భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేసినట్టు తెలిపారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకుంటే మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు.

English summary
BJP state general secretary says government has left the welfare of the people in the airCH.Vishnuvardhan Reddy said. On Sunday, the 23rd of this month, there were protests across the state over government failures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X